జై బాలయ్య.. నందమూరి అభిమానుల నోట ఎప్పుడూ వినిపించే మాట. థియేటర్లలో సినిమా షురూ అవుతుందంటే చాలు అది ఏ హీరో మూవీ అయినా ప్రేక్షకుల నుంచి జై బాలయ్య వినిపించాల్సిందే. విజిల్స్ పడాల్సిందే. అంతటి క్రేజ్ సంపాదించుకున్న బాలకృష్ణ నెక్స్ట్ మూవీ అప్డేట్ కోసం ప్రేక్షకులంతా చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఇక బాలకృష్ణ సినిమాలే కాదు ఆ మూవీస్‌లో పాటల కోసం కూడా వెయిట్ చేస్తున్నారు. బాలయ్య సినిమాలో పక్కాగా ఓ ఫుల్ మాస్ బీట్ సాంగ్ ఉండేలా చూసుకుంటున్నారు డైరెక్టర్లు. అలా బాలకృష్ణ లేటెస్ట్ మూవీ Veera Simha Reddy ( NBK 107 )నుంచి బాలయ్య బాబు ఫ్యాన్స్ ఎలా అయితే ఓ మాస్ సాంగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ల అంచనాలకు మించి ఓ సూపర్ హిట్ సాంగ్‌ను మేకర్స్ ఇవాళ రిలీజ్ చేశారు.
జై బాలయ్య అంటూ ఆంథెమ్ సాంగ్‌ని విడుదల చేశారు. బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా.. కరీముల్లా పాడారు.

రాజసం నీ ఇంటి పేరు.. పౌరుషం నీ ఒంటి పేరు అంటూ మొదలైన ఈ పాటలో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మెడలో బంగారు చైన్లు, చేతికి వాచ్, వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో బాలకృష్ణలా మారిపోయి డ్యాన్స్ చేస్తుండటం చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మూవీ లవర్స్. బాలకృష్ణ వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో స్టైలిష్ గాగుల్స్ పెట్టుకుని అభిమానులకు కావాల్సిన విజువల్ ట్రీట్ అందిస్తూ..సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాడు. ఎస్ థమన్ మరోసారి అదిరిపోయే మ్యూజిక్‌తో గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయమని తాజా సాంగ్‌తో అర్థమవుతుంది.

రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో జరిగిన వాస్తవ అంశాల నేపథ్యంలోపక్కా మాస్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం 2023 సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. కన్నడ యాక్టర్ ధునియా విజయ్ విలన్‌గా నటిస్తుండగా.. కేజీఎఫ్ అవినాష్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటిస్తు్న్నారు. శృతిహాసన్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది.