టాలీవుడ్ నటుడు జగపతిబాబు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. యంగ్ హీరోల సినిమాల్లో విలన్ పాత్రలు పోషిస్తూ సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ ఫుల్ జోష్‌లో ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన రాజమౌళి కుటుంబంపై, హీరో ప్రభాస్‌పై ప్రశంసలు కురిపించారు. గతంలో తాను డిప్రెషన్‌లో ఉండి ప్రభాస్‌కు ఫోన్ చేస్తే ఎంతో ఓదార్పునిచ్చాడని తెలిపారు. రాజమౌళి కుటుంబం గురించి మాట్లాడిన జగపతిబాబు..
వాళ్ల నుంచి 20శాతం నేర్చుకున్నా చాలన్నారు. ‘‘ఎన్ని అవార్డులు వచ్చినా.. ఎంత సాధించినా రాజమౌళి ఫ్యామిలీలో ఎవ్వరికీ గర్వం ఉండదు. ఒక్కరో ఇద్దరో కాదు ఆ కుటుంబంలోని వారంతా అలానే ఉంటారు. అందరినీ ప్రేమగా ఆదరిస్తారు. హీరో ప్రభాస్ కూడా అదే తరహా మనిషి. అతడికి ఇవ్వడమే కానీ.. అడగడం తెలీదు. ఎవరే సాయం కావాలన్నా చేస్తాడు. నాకు వ్యక్తిగతంగా ప్రభాస్‌తో ఓ అనుభవం ఉంది.
నేను ఓసారి డిప్రెషన్‌లోకి వెళ్లాను. అప్పుడు ప్రభాస్‌కు ఫోన్ చేసి మాట్లాడాలని అడిగా. తను జార్జియాలో ఉన్నాడు. ‘డార్లింగ్.. నేనున్నా కదా? నీ ప్రాబ్లమ్ చెప్పు.. నేను తీరుస్తా’ అని ధైర్యం చెప్పాడు. అంతే కాదు అక్కడి నుంచి వచ్చాక నన్ను కలిశాడు. నా కంటే చిన్నవాడైనా ఎంతో గొప్ప హృదయం తనది. ఆ సమయంలో చిన్న ఓదార్పు నాకెంతో ధైర్యాన్నిచ్చింది’’ అంటూ ప్రభాస్‌పై ప్రశంసలు కురిపించారు.