Jabardasth Rakesh – Jordar Sujatha పెళ్లి డేట్ ఫిక్స్.. గుడ్ న్యూస్ చెప్పిన జంట

- Advertisement -

జబర్దస్త్ ఫేం Jabardasth Rakesh – Jordar Sujatha జంట గురించి తెలియని వారుండరు. బుల్లితెరపై ఈ జోడీ చాలా ఫేమస్. వీళ్ల స్కిట్లతోనే కాదు.. వీరి లవ్ స్టోరికి కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే గత కొద్దిరోజులుగా వీళ్లిద్దరు ప్రేమలో మునిగి తేలుతున్నట్లు వార్తలొస్తున్న విషయం తెలిసిందే.

Jabardasth Rakesh - Jordar Sujatha
Jabardasth Rakesh – Jordar Sujatha

జబర్దస్త్ లో వీళ్లు కలిసి స్కిట్లు చేయడం.. ఆ తర్వాత ఈటీవీలో వస్తోన్న మిస్టర్ అండ్ మిసెస్ ప్రోగ్రామ్ లో జంటగా పాల్గొనడంతో వీళ్ల రిలేషన్ షిప్ ను కన్ఫామ్ చేశారు నెటిజన్లు. అయితే వీళ్లు తెరపై కనువిందు చేయడమే తప్ప తెర వెనక స్టోరీని మాత్రం నెటిజన్లకు క్లారిటీ ఇవ్వలేదు.

Sujatha and Rakesh

చాలా రోజుల నుంచి వీళ్లిద్దరు పెళ్లి చేసుకుంటారు అని వస్తున్న వార్తలపై నెటిజన్లకు క్లారిటీ లేదు. ఈ జంట కూడా క్లారిటీ ఇవ్వాలనుకోలేదు. ఇప్పటి వరకు వీళ్లిద్దరు పబ్లిగ్ గా ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను వ్యక్తపరిచారు కానీ.. ఆ ప్రేమ నెక్స్ట్ స్టెప్ కు వెళ్లే రకమా.. లేక ఓన్లీ ఫ్రెండ్షిపేనా అనే విషయంలో స్పష్టత లేదు. 

- Advertisement -

అయితే తాజాగా ఈ జంట తమ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తమ బంధాన్ని మరో స్టేజ్ కి తీసుకెళ్లేందుకు రెడీగా ఉన్నట్లు ప్రకటించింది. దీనికి ఇరువురు కుటుంబ సభ్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు సుజాత-రాకేశ్. త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నామని శుభవార్త చెప్పారు.

జోర్దార్ సుజాత తన యూట్యూబ్ ఛానెల్ అయిన సూపర్ సుజాత ఛానెల్ లో ఈ గుడ్ న్యూస్ ను తన సబ్ స్క్రైబర్లతో పాటు అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ వీడియోలో రాకింగ్ రాకేశ్ తో తన పరిచయం.. ఆ తర్వాత స్నేహం.. అది ప్రేమకు దారి తీయడం.. ఇరు కుటుంబాలు కలుసుకోవడం.. చివరకు వీళ్ల బంధం పెళ్లి వరకు రావడం గురించి.. అంతా వివరించింది. 

ఈనెల చివర్లో రాకేశ్-సుజాత నిశ్చితార్థం ఉండనుంది. అదే రోజున లగ్నపత్రిక రాసుకుని పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకుంటారట. ఈ గుడ్ న్యూస్ విని రాకేశ్ సుజాత ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. ఇద్దరికి తమ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

 వీళ్ల పెళ్లిపైనా రాకేశ్ వాళ్ల అమ్మ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సుజాత ఇప్పటికే తమ కుటుంబ సభ్యులతో కలిసి పోయిందని సంతోషం వ్యక్తం చేసిందంట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here