Sowmya Rao : జబర్దస్త్.. కత్తిలాంటి కామెడీ షో.. అంటూ ప్రతి గురు, శుక్రవారాలు ప్రేక్షకులను నవ్విస్తోన్న షో. ఈ షో కేవలం కామెడీ కోసమే కాకుండా యాంకర్లైన రష్మీ, అనసూయల గ్లామర్ షో, వాళ్ల డ్యాన్సుల కోసం చూసేవారు చాలా మంది. అనసూయ యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ షో టీఆర్పీ ఒకప్పుడు ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ తర్వాత రష్మీ కూడా జాయిన్ అవ్వడంతో ఇక ప్రేక్షకులు పండగ చేసుకున్నారు.
కానీ ఇటీవల పలు కారణాలతో అనసూయ జబర్దస్త్‌కు గుడ్‌బై చెప్పేసింది. ఈ షోలో తరచూ యాంకర్లు, జడ్జిలు, టీమ్ లీడర్లు, కంటెస్టెంట్లు మారడం సర్వసాధారణం అయిపోయింది. కానీ ఎవరున్నా లేకున్నా షో మాత్రం నాన్‌స్టాప్‌గా సాగుతూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది. రీసెంట్‌గా అనసూయ ప్లేస్‌లోకి కొత్త యాంకర్‌గా సౌమ్య రావు వచ్చింది. కొత్త యాంకర్‌తో ఈ షోలో కొత్త జోష్ తీసుకొచ్చేందుకు షో మేకర్స్ తెగ ప్రయత్నిస్తున్నారు.
సౌమ్య రావు జబర్దస్‌కు ముందు కూడా జనాల్లో మంచి పాపులారిటీ ఉన్న యాంకర్. తనదైన స్టైల్లో యాంకరింగ్ చేస్తూ తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో దూసుకెళ్తోంది. ఈ కన్నడ బ్యూటీ అందానికి ఫిదా అయిన మల్లెమాల ఈమెను జబర్దస్‌లోకి తీసుకొచ్చింది. సాధారణంగానే జబర్దస్త్‌లో యాంకర్లు, జడ్జిలపై సెటైర్లు వేయడం కంటెస్టెంట్లకు అలవాటు. ఇలా వారిపై సెటైర్లు వేస్తూ పండించిన వినోదానికి ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోతారు. కొన్నిసార్లు యాంకర్లకు లైన్ వేయడానికి ప్రయత్నిస్తుంటారు కొందరు కంటెస్టెంట్లు. అయితే ఇది కేవలం సరదా కోసం మాత్రమే. స్కిట్ హైలైట్ అవ్వడానికి అలా సరదాగా ఫ్లర్ట్ చేస్తుంటారు.
అయితే సౌమ్య రావుని లైన్‌లో పెట్టడానికి ఓ టాప్ కమెడియన్ తెగ ట్రై చేస్తున్నాడట. ఆమెను చాలా విసిగిస్తున్నాడట. సౌమ్య వచ్చి కొద్ది రోజులే అవుతున్నా.. ఆమె ఫోన్ నంబర్ తీసుకుని చాట్ చేయడం.. డిన్నర్‌కు వెళ్దాం అంటూ ఫోర్స్ చేయడం ఇలా రకరకాలుగా చికాకు పెడుతున్నాడట. ఆమెకు ఇష్టం లేకపోయినా రాసుకు పూసుకొని తిరగడంతో పాటు ఇతర కంటెస్టెంట్స్‌కు ఈమెపై తప్పుడు అభిప్రాయం వచ్చేలా బిహేవ్ చేస్తున్నాడట. ఈ విషయం తెలుసుకున్న మల్లెమాల మేనేజ్‌మెంట్ కమెడియన్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిందట. స్క్రీన్ మీద ఎన్ని వేశాలు వేసినా.. బయట ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలని హెచ్చరించారట.
ఎవరి స్కిట్లు వారు చేసుకుని కామ్‌గా బయట పడండి.. పిచ్చి వేశాలు వేసి.. కెరీర్‌ను ఇబ్బందుల్లోకి నెట్టుకోవద్దు అంటూ అందరికి వార్నింగ్ ఇస్తోందట మల్లెమాల టీమ్. బయటకి వెళ్తే ఏ కామెడీ షో పర్ఫెక్ట్‌గా రన్ అవ్వడంలేదు. జబర్థస్త్ మాత్రమే కాస్త స్టాండెడ్స్స్ మెయింటైన్ చేస్తుండటంతో.. చాలా మంది బయటకు వెళ్లిన వారు కమ్ బ్యాక్ ఇస్తున్నారని.. అందుకే ఉన్నన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలని చెబుతోందట.