Mahesh Babu – Rajamouli మూవీకి పవన్ కళ్యాణ్ ఫ్లాప్ మూవీ టైటిల్ పెట్టబోతున్నారా..? ఆగష్టు 9 ఫ్యాన్స్ కి పండగే!

- Advertisement -

Mahesh Babu – Rajamouli  : #RRR వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు అనే సంగతి మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి అయ్యింది. హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రతీ రోజు వర్క్ షాప్ కూడా నిర్వహిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా గ్లోబ్ తొర్టింగ్ నేపథ్యం లో సాగుతుంది అని రాజమౌళి ఇది వరకే అభిమానులకు తెలిపాడు. అంటే ప్రపంచాన్నే చుట్టేసిన వీరుడు అనే అర్థం వస్తుంది అన్నమాట. ఫారెస్ట్ అడ్వెంచర్ జానర్ లో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నాడు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఎదో ఒక అప్డేట్ మహేష్ బాబు పుట్టినరోజు నాడు, ఆగష్టు 9 వ తేదీన వస్తుందని అభిమానులు అనుకున్నారు. కానీ ఎలాంటి అప్డేట్ రాదనీ మూవీ టీం నుండి తెలిసింది.

Mahesh Babu - Rajamouli
Mahesh Babu – Rajamouli

కానీ టైటిల్ గురించి మాత్రం చిన్న హింట్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ చిత్రానికి ‘గోల్డ్’ అనే టైటిల్ ని పెట్టబోతున్నారట. బంగారం నిధి ని అన్వేషించే పాత్రలో ఇందులో మహేష్ బాబు కనిపించబోతున్నాడు. అందుకే ఆ టైటిల్ ని పెట్టే ఆలోచనలో ఉన్నాడట రాజమౌళి. కానీ రాజమౌళి సినిమా టైటిల్ అంటే చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. టైటిల్ తోనే ఆయన సగానికి పైకి క్రేజ్ ని తనకి సినిమాకి తీసుకొస్తాడు. కానీ ఇక్కడ గోల్డ్ అనే టైటిల్ మాత్రం చాలా సింపుల్ గా, సాదాసీదాగా అనిపిస్తుంది.

Mahesh Babu thrilled about his next with SS Rajamouli, says it's going to be massive - India Today

- Advertisement -

ఇది మహేష్ బాబు ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే భయం మేకర్స్ లో కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇది పక్కన పెడితే ‘గోల్డ్’ అంటే ‘బంగారం’ మూవీ టైటిల్ తో గతం లో పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ల్యాండ్ మార్క్ గా నిల్చిన పోకిరి చిత్రానికి ఈ సినిమా పోటీ గా దిగింది. ఓపెనింగ్స్ లో బంగారం చిత్రం దుమ్ములేపినప్పటికీ, ఫుల్ రన్ లో పోకిరి కి దగ్గర్లోకి కూడా రాలేకపోయింది. ఇప్పుడు ఆ సినిమా టైటిల్ ని రాజమౌళి పెట్టే ఆలోచనలో ఉండడం గమనార్హం. ఆగష్టు 9 వ తేదీన ఈ సినిమా టైటిల్ గురించి పూర్తి అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.

 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here