Sundeep Kishan : టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరోస్ లో ఒకరు సందీప్ కిషన్..ప్రతీ సినిమా తో విభిన్నమైన పాత్రలు చేస్తూ, సరికొత్త రీతిలో సినిమాలను తియ్యాలని పరితపిస్తుంటాడు, కానీ అదృష్టం కలిసిరాక ఇప్పటికీ కెరీర్ లో ఒక్క సూపర్ హిట్ సినిమా మినహా మరొకటి లేదు, రీసెంట్ గా పాన్ ఇండియన్ సబ్జెక్టు అంటూ భారీ బడ్జెట్ మరియు భారీ తారాగణం తో ‘మైఖేల్’ అనే సినిమా తీసాడు.నిన్న ఈ చిత్రం అన్ని ప్రాంతీయ బాషలలో విడుదలై యావరేజి రెస్పాన్స్ ని దక్కించుకుంది.
అయితే మొదటి నుండి ఈ సినిమాకి బాగా ప్రొమోషన్స్ చెయ్యడం తో ఓపెనింగ్స్ బాగా వచ్చాయి.రెగ్యులర్ మీడియం హీరో రేంజ్ ఓపెనింగ్స్ రాకపోయినప్పటికీ కూడా సందీప్ కిషన్ గత చిత్రాలతో పోలిస్తే పర్వాలేదు అనే రేంజ్ ఓపెనింగ్ వచ్చింది అని చెప్పొచ్చు.ఇది ఇలా ఉండగా విడుదలకు ముందు ఆయన ఇచ్చిన కొన్ని ఇంటర్వూస్ లో చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
ఇది ఇలా ఉండగా సందీప్ కిషన్ ఇటీవల ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ రెజినా పుట్టిన రోజు నాడు శుభాకాంక్షలు తెలియచేస్తూ ‘లవ్ యూ’ అని వాళ్ళిద్దరి క్లోజ్ గా దిగిన ఒక ఫోటోని అప్లోడ్ చేస్తూ విష్ చేసాడు, దీని పై సోషల్ మీడియా లో రకరకాలుగా పుకార్లు షికార్లు చేసాయి.రెజీనా తో సందీప్ కిషన్ డేటింగ్ లో ఉన్నాడని, త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ప్రచారం చేసారు.ఇది బాగా వైరల్ అయ్యేలోపు సందీప్ కిషన్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు.
ఆయన మాట్లాడుతూ ‘నేను రెజినా కలిసి దాదాపుగా నాలుగు సినిమాల్లో నటించాము. ఒక హీరో హీరోయిన్ కలిసి అన్ని సినిమాల్లో నటిస్తూ ఇలాంటి రూమర్స్ రావడం మనం మొదటి నుండి చూస్తూనే ఉన్నాము. మేమిద్దరం మంచి స్నేహితులం.. అంత వరకే కానీ మా మధ్య సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతున్నట్టు కాదు, రెజినా ముంబై లో ఏదైనా షూటింగ్ జరిగి లేట్ అయ్యినప్పుడు అక్కడ ఉన్న మా అక్క వాళ్ళ ఇంట్లోనే ఉండిపోతుంది, మేము అంత క్లోజ్’ అని చెప్పుకొచ్చాడు సందీప్ కిషన్.