Janhvi kapoor : బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి అందరికీ తెలుసు.. తెలుగులోకి ఇటీవలే ఎంట్రీ ఇచ్చింది.. ఎన్టీఆర్ దేవర సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.. ఆ సినిమా షూటింగ్ దశలో ఉంది.. త్వరలోనే విడుదల కాబోతుందని ప్రచారంలో ఉంది.. కాగా, ఈమెకు తీవ్ర అస్వస్థత కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అసలేం జరిగిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
అసలు మ్యాటరేంటంటే.. జూలై 12వ తేదీన అనంత్ అంబాని, రాధిక మర్చంట్ వివాహానికి తన ప్రియుడు శిఖర్ పహారియా తో హాజరైన ఈ ముద్దుగుమ్మ, ఆ తర్వాత హాస్పిటల్లో చేరింది. అయితే జాన్వి ఫుడ్ పాయిజన్ కి గురైందని అందుకే హాస్పిటల్లో జాయిన్ చేశారని సమాచారం.. ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించినట్లు తెలుస్తుంది.. ప్రస్తుతం జాన్వీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, త్వరలోనే డిశ్చార్జ్ చెయ్యనున్నట్లు సమాచారం.. ఈ విషయం తెలిసి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. త్వరగా కోలుకొని ఇంటికి రావాలని కోరుకుంటున్నారు..
జాన్వీ కపూర్ సినిమాల విషయానికొస్తే.. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న దేవర అనే సినిమాలో హీరోయిన్గా ఎంపికయింది. మొదటిసారి తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న ఈ అమ్మడు ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.. ఉలజ్ అనే సినిమాలో ఈమె నటిస్తోంది. ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్ ని మేకర్స్ విడుదల చేయగా.. సినిమా భారీ విజయాన్ని అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.. ఈ సినిమాతో పాటుగా రామ్ చరణ్ సినిమాలో కూడా హీరోయిన్గా చేస్తుంది..