Veera Simha Reddy : నందమూరి బాలయ్య బాబు నటించిన వీర సింహారెడ్డి గురించి అందరికి తెలుసు.. అఖండతో భారీ హిట్ ను అందుకున్న బాలయ్య ఇప్పుడు మరో సెన్సెషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన ప్రధాన పాత్రలో డైరెక్టర్ గోపిచంద్ మలినేని తెరకెక్కిస్తోన్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ వీరసింహారెడ్డి.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను అందుకున్నాయి..అన్ని కార్యక్రమాలు కంప్లీట్ చేసుకున్న ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతుంది.

ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించగా.. ఇందులో బాలయ్య సరసన శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్.. ట్రైలర్ అంచనాలు పెంచేసాయి. ఇక ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో విడుదల చేసిన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది..బాలయ్య చెప్పిన డైలాగ్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అలాగే..ఈ ట్రైలర్ లో ఆయన చెప్పిన ఓ డైలాగ్‌కు జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధముందని టాక్ వినిపిస్తుంది.

అదే.. ‘ పది నిమిషాల్లో క్లోజ్ అయ్యే ఏ పబ్ దగ్గరికైనా వెళ్లి అడుగు.. అక్కడ నీకో స్లోగన్ వినిపిస్తుంది ‘ అనగానే.. ‘జై బాలయ్య..’ అంటూ వాయిస్ వస్తుంది. ఇప్పుడు ఆ వాయిస్ ఎవరిదనే చర్చ జరుగుతుంది.. గతంలో డైరెక్టర్ రాజమౌళి కుమారుడు కార్తికేయ పెళ్లిలో ఎన్టీఆర్ జై బాలయ్య అంటూ స్లోగన్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే వాయిస్ ను కట్ చేసి ట్రైలర్ లో పెట్టారని క్లియర్ గా అర్థమవుతుంది.. ఏది నిజమో తెలియాల్సి ఉంది.. మొత్తానికి ఈ సినిమాకు హైప్ ను క్రియేట్ చేసింది..మరి సినిమా ఎలాంటి టాక్ అందుకుంటుందో చూడాలి..