Director Rajamouli : ప్రస్తుతం ఇండియా లో స్టార్ హీరోలందరికంటే పెద్ద స్టార్ స్టేటస్ ఉన్న దర్శకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది రాజమౌళి మాత్రమే. మన టాలీవుడ్ స్థాయిని హాలీవుడ్ రేంజ్ కి తీసుకెళ్లి ఆస్కార్ అవార్డు ని దక్కించుకున్న గొప్ప దర్శకుడు ఆయన. అలాంటి స్టార్ స్టేటస్ ఉన్న రాజమౌళి తో సినిమా చేసే అవకాశం రావడం ఒక అదృష్టం అనే చెప్పాలి. ఇప్పుడు ఆ అదృష్టం సూపర్ స్టార్ మహేష్ బాబు కి దక్కింది. వాస్తవానికి వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా ఖరారు అయ్యి దశాబ్దం దాటింది. కానీ రాజమౌళి తనకి ఉన్న కమిట్మెంట్స్ అన్నీ పూర్తి చేసుకొని, మహేష్ తో సినిమా చేసేందుకు ఇన్ని రోజుల సమయం పట్టింది. అయితే అప్పట్లో రాజమౌళి కేవలం నలుగురైదుగురు స్టార్ డైరెక్టర్స్ లో ఒకడు మాత్రమే.
కానీ ఇప్పుడు హాలీవుడ్ సినిమాలతో సైతం పోటీ పడగల సత్తా వచ్చింది. ఇన్నేళ్లు అభిమానులు వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా కోసం ఎదురు చూసినందుకు మంచి ప్రాజెక్ట్ దక్కింది అని విశ్లేషకులు సైతం అనుకుంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి రాజమౌళి తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది. ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్ ఆర్ట్స్ బ్యానర్ పై కే ఎస్ రామారావు నిర్మిస్తున్నారు. అడ్వాన్స్ గా ఇప్పటికే ఆయన రాజమౌళి కి వంద కోట్ల రూపాయిలు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత లాభాల్లో 30 శాతం వాటా కూడా రాజమౌళి కోరినట్టు సమాచారం.
అంటే ఇప్పుడు ఆ సినిమా 2000 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేస్తే, 600 కోట్ల రూపాయిలు రాజమౌళి కి పారితోషికంగా వెళ్తుంది అన్నమాట. ఆ రేంజ్ రెమ్యూనరేషన్ తో మూడు బాహుబలి లాంటి భారీ బడ్జెట్ సినిమాలు చెయ్యొచ్చు. ప్రస్తుతం రాజమౌళి కి ఉన్న బ్రాండ్ విలువ కి ఆ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకోవడం లో ఏ మాత్రం తప్పు లేదని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో నెగటివ్ రోల్ చేసేందుకు మలయాళం టాప్ హీరో ప్రిథ్వి రాజ్ ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ఇంకా ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు ఆగష్టు 9 వ తేదీన మహేష్ బాబు పుట్టిన రోజు నాడు అధికారికంగా తెలియనుంది. అలాగే ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ లో మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట.