Devara #RRR వంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివతో దేవర అనే చిత్రం చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ చిత్రంపై అభిమానుల్లో మాత్రమే కాకుండా ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. విడుదలైన టీజర్, మొదటి లిరికల్ వీడియో సాంగ్ కి కూడా ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 27 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్ లో అన్నీ భాషల్లో విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కూడా దాదాపుగా అన్నీ ప్రాంతాలలో పూర్తి అయ్యాయి. డిజిటల్+ సాటిలైట్ రైట్స్ కూడా రికార్డు ధరకు అమ్ముడుపోయాయి.
ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ చిత్రం లో ప్రముఖ సీనియర్ నటి మని చందన జూనియర్ ఎన్టీఆర్ కి తల్లి పాత్రలో నటిస్తుంది. ఈ పాత్రకి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాల్లో ఇటీవలే పాల్గొన్న ఆమె సోషల్ మీడియా లో ఒక వీడియో అప్లోడ్ చేసింది. ఈ వీడియో లో ఆమె ‘ సాదా సీదా మగాళ్ళు కావాలా.. లేదా ఈ ఊరినే ఉప్పొంగించే వీరుడు కావాలా..!’ అంటూ ఆమె చెప్పిన డైలాగ్ కి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.
ఈ డైలాగ్ ని బట్టీ చూస్తే డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్రం లో ఎన్టీఆర్ కి ఎలివేషన్స్ ఇస్తూ ఏ స్థాయిలో డైలాగ్స్ రాశాడో అర్థం చేసుకోవచ్చు, ఈసారి బాక్స్ ఆఫీస్ ఊచకోత ఎవ్వరూ ఊహించని స్థాయిలో ఉంటుంది అంటూ అభిమానులు మురిసిపోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించి కేవలం 20 శాతం షూటింగ్ మాత్రమే బ్యాలన్స్ ఉంది. ఎన్టీఆర్ ఈ నెలాఖరులో తన పాత్రకి సంబంధించిన షూటింగ్ ని పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించాడు. రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని డైరెక్టర్ కొరటాల శివ ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. రెండవ భాగం వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.