Deepika Padukone ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో దీపికా పదుకొనే పేరు నెంబర్ 1 స్థానం లో ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ప్రభాస్ వంటి సూపర్ స్టార్స్ కి ఎలాంటి బ్రాండ్ ఇమేజి ఉందో, దీపికా పదుకొనే కి కూడా అలాంటి బ్రాండ్ ఇమేజి ఉంది. రీసెంట్ గా ఆమె హీరోయిన్ గా నటించిన కల్కి చిత్రం విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఏ స్థాయి సునామీ ని సృష్టిస్తుందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. మరో రెండు రోజుల్లో ఈ చిత్రం వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కూడా అందుకోబోతుంది. అయితే దీపికా పదుకొనే కెరీర్ సంగతి కాసేపు పక్కన పెడితే, ఆమె వ్యక్తిగత జీవితం ఒకప్పుడు ఎన్నో కాంట్రవర్సిలతో నిండిపోయి ఉండేది.
రీసెంట్ గానే ఆమె ప్రముఖ బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ ని ప్రేమించి పెళ్లాడింది. ఇతన్ని పెళ్లి చేసుకునే ముందు ఆమెకి పలువురి హీరోలతో అఫైర్స్ నడిచాయని బాలీవుడ్ వర్గాల్లో జోరుగా సాగే చర్చ. ‘ఎనిమల్’ చిత్రం ద్వారా మన తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైన రణబీర్ కపూర్ తో ఈమె అప్పట్లో ప్రేమాయణం నడిపింది అనే టాక్ ఉండేది. సుమారుగా నాలుగేళ్లు వీళ్లిద్దరు డేటింగ్ కూడా చేసుకున్నారని, ఆ తర్వాత కొన్ని అనుకోని కారణాల వల్ల విబేధాలు ఏర్పడి విడిపోవాల్సి వచ్చిందని, ఆ సమయం లో బాగా డిప్రెషన్ కి గురైన దీపికా పదుకొనే, ఆత్మహత్య కి కూడా ప్రయత్నం చేసిందని సోషల్ మీడియా లో ఒక ప్రచారం బాగా జరిగేది.
ఈ ప్రచారం తప్పు అని అటు రణబీర్ కపూర్ కానీ, ఇటు దీపికా పదుకొనే కానీ ఖండించకపోవడం మరో విశేషం. అయితే దీపికా పదుకొనే మానసికంగా ఇలా కృంగిపోయి ఉన్న రోజుల్లో రణవీర్ సింగ్ ఆమెకు ధైర్యం చెప్తూ ఒక స్నేహితుడిగా ఎంతో చేరువ అయ్యాడని, ఆ తర్వాత కొన్ని రోజులకు ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారని టాక్. ఇకపోతే రణబీర్ కపూర్ ప్రముఖ యంగ్ హీరోయిన్ అలియా భట్ ని పెళ్లి చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరికి ఒక కుమార్తె కూడా ఉంది. అయితే దీపికా పదుకొనే, రణవీర్ సింగ్ కి మాత్రం ఇప్పటి వరకు పిల్లలు లేరు. కొంతకాలం క్రితం వీళ్లిద్దరు విడిపోయారు అనే వార్తలు కూడా వచ్చాయి, అయితే వాటిల్లో ఎలాంటి నిజం లేదని తర్వాత తెలిసింది.