Cinema Gossips : సినీ ఇండస్ట్రీలో మామూలు వాళ్ళకు అవకాశాలు రావడం చాలా కష్టం.. కేవలం ఇండస్ట్రీలోని వాళ్ళ వాళ్ళకు మాత్రమే సినీ అవకాశాలు వస్తున్నాయి.. అయితే కొంత మంది హీరోలు బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా సక్సెస్ అవ్వలేక పోతున్నారు. అందుకు కారణాలు కూడా చాలానే ఉన్నాయి..బ్యాక్ గ్రౌండ్ ఉందనే వారికి హిట్ అవ్వకున్న ఛాన్స్ లు వస్తున్నాయని అందరికి తెలుసు..ఇప్పుడు ఓ స్టార్ నిర్మాత కొడుకు పరిస్థితి కూడా అలానే మారింది.
సెన్సేషనల్ సినిమాలు తీస్తూ సక్సెస్ కి కేరాఫ్ అడ్రస్ గా మారారు. ఆయన నిర్మాణంలో వచ్చే సినిమాలు ఆ స్థాయిలో ఉండేది. అయితే నిర్మాతగా కొనసాగుతున్న ఆయనకు ఒక్కసారిగా దర్శకత్వం వైపు చూపు మళ్ళింది. దాంతో నిర్మాత నుంచి డైరెక్ట్ గా మారతూ తనకు నిర్మాతగా ఉన్న క్రేజ్,ఇమేజ్ ని చేతులారా చెడగొట్టుకున్నారు. అయితే సదరు నిర్మాత అందరితో ఆగకుండా తన కుమారుడు లైఫ్ ని కూడా చెడగొట్టడానికి ప్రయత్నించాడు. ఆ నిర్మాతకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు.అతను కూడా బడా హీరో..
తండ్రి కూడా కొడుకు లైఫ్ ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారు. వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. కానీ, ఎందుకు చేస్తున్నాడో అసుల ఏం సినిమాలు చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితుల్లో వున్నాడట ఆ నిర్మాత తనయుడు. అతను నటించిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అవుతోంది. అందుకు గల కారణం కథలో కంటెంట్ లేకపోవడమే అని చెప్పవచ్చు. ఆ నిర్మాత తనయుడు యంగ్ హీరోల రేసులో సత్తా చాటగల నటనా ప్రతిభ ఉన్నప్పటికీ తండ్రి సపోర్ట్ లేక పోవడంతో ఏదొ కథను సెలెక్ట్ చేసుకొని ప్లాప్ ను తన ఖాతాలో వేసుకుంటున్నాడు.
ఇండస్ట్రీలో ఎన్నో మంచి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన ఆ నిర్మాత తన కొడుకు కెరియర్ కు మాత్రం ఒక మంచి సినిమాను సెలెక్ట్ చేయలేకపోతున్నాడు. నిర్మాతది ఎంత తప్పు ఉందో కొడుకుది కూడా అంతే తప్పు ఉంది అని చెప్పవచ్చు. అతను కూడా తన బాడీ లాంగ్వేజ్ కి సూట్ అయ్యే విధంగా కథలు ఎంపిక చేసుకోకపోవడమే మైనస్ గా చెప్పవచ్చు.
మరి ముఖ్యంగా తండ్రి మాటను జవదాట లేక తండ్రి చెప్పిన విధంగా నడుచుకుంటూ ఫెయిల్యూర్ హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. హీరో తండ్రి అడుగడుగునా అడ్డుపడుతూ తన చేతుల తో కొడుకు లైఫ్ ను నాశనం చేస్తూ..విలన్ అయ్యాడని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు..కొడుకు కోసం ఆయన తన నిర్ణయాన్ని మార్చుకుంటాడో లేదో చూడాలి..