Waltair Veerayya : సుమ అడ్డాలో మెగాస్టార్.. ఆ సీక్రెట్ చెప్పిన చిరంజీవి

- Advertisement -

Waltair Veerayya : మెగాస్టార్​ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం సంక్రాంతి బ్లాక్​బస్టర్​గా నిలిచింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో చిరు బిజీబిజీగా ఉన్నారు. ఇటీవలే సక్సెస్ మీట్ కూడా పెట్టారు. సక్సెస్ మీట్ లో సినీ కార్మికులకు, Waltair Veerayya టీమ్ కు చిరంజీవి సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈ మూవీ రిలీజ్ అయి ఇప్పటికే ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటోంది. 

Waltair Veerayya
Waltair Veerayya

ప్రస్తుతం వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు చిరంజీవి. ఈ క్రమంలోనే ​ సుమ యాంకర్​గా వ్యవహరిస్తున్న ‘సుమ అడ్డా’ షోకు చిరంజీవి ముఖ్య అతిథిగా వెళ్లారు. షోలో సుమ అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలిచ్చారు. సుమ సంధించిన ఓ ప్రశ్నకు జావాబిస్తూ.. ఓ ఆసక్తికర విషయం చెప్పారు​. అదేంటంటే..?

Suma Adda

సుమ అడ్డాలో చిరంజీవి ఫుల్ ఫన్ పండించారు. అందరితో కలిసి బాగా ఎంజాయ్ చేశాడు. 154వ సినిమా అయినా ఫస్ట్ షాట్ అంటే ఇప్పటికీ టెన్షన్.. అని చిరంజీవి తన సీక్రెట్ చెప్పారు.  సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్న చిరు.. సుమ అడ్డా షోకు ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయనతో పాటు ఈ షోకు దర్శకుడు బాబీ, హాస్యనటుడు వెన్నెల కిషోర్​ వచ్చి సందడి చేశారు.

- Advertisement -

‘సుమ అడ్డా’ షోలో మెగాస్టార్​కు​ గ్రాండ్​ వెలకమ్​ ఇచ్చారు. షోకు వచ్చిన అభిమానులు అరుపులతో మోతెక్కించారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. ‘జేజమ్మా’ అని సుమను ఆటపట్టించారు. ‘పూనకాలు లోడింగ్​ అని ఏ సమయంలో బాబీ అన్నాడో కానీ నింజగా థియేటర్లలో పూనకాలు వస్తున్నాయి’ అని అన్నారు మెగాస్టార్​. అనంతరం షో యాంకర్​ సుమ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘చాలా రోజుల నుంచి నిన్ను చూస్తున్నాను.. నీ గ్రోత్​ను గమనిస్తున్నాను. నీలాంటి వాళ్లు యాంకర్​గా ఉన్న ఇలాంటి షోకు రావడం ఓ స్టేటస్​గా ఫీల్​ అవుతున్నాను’ అని సుమను ఆకాశానికెత్తేశారు.

ఈ క్రమంలో సుమ మెగాస్టార్​ను ఓ ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. ‘ మేము సినీ పరిశ్రమకు రావడానికి చిరంజీవి కారణమని చాలా మంది అంటారు. అప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది?’ అని అడిగారు. దీనికి మెగాస్టార్​ సమాధానమిస్తూ.. ”యాక్టర్లు, డ్యాన్సర్లు, ఫైట్​ మాస్టర్లు లాంటి చాలా మంది.. ‘మీ స్ఫూర్తితోనే సిమాల్లోకి వచ్చాం’ అంటుంటారు. అంలాటివి విన్నప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నా స్టార్​ స్టేటస్, సినిమాల ద్వారా సంపాదించుకున్న ఇమేజ్​​ కన్నా ఇలాంటివే నాకు ఎనలేని సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తాయి. ఇది నాకు దొరికిన గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్న” అని సమాధానమిచ్చారు.

అనంతరం దర్శకుడు బాబీ స్పందిస్తూ.. మెగాస్టార్​ చిరంజీవి సెల్ఫ్​మేడ్​ స్టార్​ అని.. అయన ప్రతి సినిమా మొదటి మూవీలానే ప్రెజెంట్​ చేస్తారు అని చెప్పారు. దీనిపై సుమ అడిగిన ప్రశ్నకు చిరంజీవి స్పందిస్తూ.. ‘అది ఏ సినిమా అయినా ఎంత నంబర్​ అయినా.. నాకు మొదటి చిత్రం ‘ప్రాణం ఖరీదు’ చేస్తున్నట్టే అనిపిస్తుంది. ప్రతి రోజు.. ఏ సన్నివేశం అయినా.. ఏ క్యారక్టర్​ అయినా కొత్తగా చేయాలని పరితపిస్తుంటాను’ అని చెప్పారు. ఈ సందర్భంగా వాల్తేరు వీరయ్యలో ఓ సీన్​ను పండించడానికి తాను ఏం చేశానో చెప్పారు చిరంజీవి. ఇంటి నుంచే వేరుశెనగ పొట్టు తీసుకెళ్లానని గుర్తు చేసుకున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here