Chiranjeevi in suma adda : రికార్డ్స్‌లో నా పేరు ఉండటం కాదు.. నా పేరు మీదే రికార్డులు ఉంటాయి’ అంటూ సంక్రాంతి బరిలోకి దిగారు మెగాస్టార్ చిరంజీవి. వాల్తేరు వీరయ్య సినిమాతో ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వింటేజ్ లుక్‌లో పాత చిరంజీవిని చూసిన ఫ్యాన్స్ ఒక్కసారిగా తబ్బుబ్బైపోయారు. వీరయ్యకు మరోసారి వీర అభిమానులైపోయారు.
చిరంజీవని మాస్ క్యారెక్టర్‌లో చూసి చాలా ఏళ్లవుతున్న సందర్భంగా.. వాల్తేరు వీరయ్యలో ఊరమాస్ క్యారెక్టర్‌లో చిరుని చూసిన ఫ్యాన్స్ తెగ సంబురపడి పోయారు.ప్రస్తుతం వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు చిరంజీవి. ఇందులో భాగంగానే ఈటీవిలో ప్రసారం అయ్యే సుమ అడ్డా షో కు గెస్ట్ గా వెళ్లారు. ఈ షో లో చిరంజీవి ఫుల్ ఫన్ అందించారు. సుమ తో కలిసి చిరు ప్రేక్షులను ఫుల్ గా ఎంటరటైన్ చేశారు.
ఇక ఈ షో లో మెగాస్టార్ తనకి సంబంధించిన చాలా సీక్రెట్స్ చెప్పారు. అంతేకాకుండా సుమను బాగా ఆటపట్టించారు. సుమ అడ్డాకు గెస్టుగా వచ్చిన మెగాస్టార్ ఓ విషయంలో సుమపై ఫైర్ అయ్యారు. సుమకు గర్వమా.. లేక అదే నైజమా అంటూ ప్రశ్నించారు. ఇంతకీ సుమపై చిరు ఎందుకు ఫైర్ అయ్యారో తెలుసా..? సుమ అడ్డాలో మెగాస్టార్ చిరంజీవి ఓ విషయాన్ని షేర్ చేసుకున్నారు.
గత మూడేళ్లుగా యాంకర్ సుమకు తన పుట్టిన రోజు బర్త్ డే విషెస్ చెబుతూ చిరంజీవి మెసేజ్ చేసినా.. సుమ కనీసం రిప్లై కూడా ఇవ్వలేదట. ఈ విషయం గురించి చెబుతూ.. సుమ ఎందుకు నా మెసేజ్‌ను పట్టించుకోలేదు.. నీకు గర్వమా.. లేక అదే నీ నైజమా.. రిప్లై ఇవ్వకపోవడం నీ నైజమైతే.. రిప్లై ఇవ్వకపోయినా.. ప్రతి పుట్టిన రోజుకు నీకు విషెస్ చెప్పడం నా నైజం అన్నారు.
దీనిపై సుమ స్పందిస్తూ.. అయ్యయ్యో.. అది మీ నంబర్ అని నాకు తెలియదు సార్. అసలు నాకు చిరంజీవి గారు బర్త్ డే విష్ చెబుతారని నేను ఎలా అనుకుంటాను. అసలు కల్లో కూడా అది ఊహించను కదా సార్. ఐయామ్ రియల్లీ సారీ సార్. ఇక సోషల్ మీడియాలో నన్ను ఆడుకుంటారు సార్. అంటూ చెప్పింది సుమ.
దీనికి చిరంజీవి నవ్వుతూ సమాధానమిస్తూ.. అలాగేం చేయరులే సుమా.. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను నీకు కాల్ చేశాను కదా.. అప్పుడు నేను నీకు మూడేళ్ల నుంచి మెసేజ్ చేస్తున్నానని చెప్పాను. అప్పుడే నువ్వు నాకు సారీ చెప్పావ్. నేనని తెలియక రిప్లై ఇవ్వలేదని.. కానీ మీరు కాల్ చేసినందకు చాలా సంతోషంగా ఉందని.. చాలా సంబురపడిపోయావు అని చిరంజీవి అన్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.