టెలివిజన్ తెరపై నాగిని అంటే గుర్తొచ్చే పేరు మౌనీరాయ్. కానీ ఇప్పుడు ఆ పేరుని మరో బ్యూటీ దక్కించుకుంది. ఆమే తేజస్వీ ప్రకాశ్ . హిందీ బిగ్‌బాస్ షో విన్నర్‌గా గెలిచిన ఈ బ్యూటీ ఆ సీజన్‌లో చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఆ షోతో Tejasswi Prakash రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ముఖ్యంగా కో-కంటెస్టెంట్ కరణ్ కుంద్రాతో కలిసి ఈ బ్యూటీ చేసిన సందడి.. రొమాన్స్‌కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
రిష్తా లిఖేంగే హమ్ నయా, కర్ణ్ సంగిని, సిల్‌సిలా బదల్తే రిష్తోంకా, నాగిన్ ఇలా పలు హిట్ సీరియల్లలో నటించి గుర్తింపు పొందింది తేజు. ఆ తర్వాత ఖత్రోంకీ ఖిలాడీ రియాల్టీ షోలో మెరిసింది. ఈ షో హోస్ట్ అయిన బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టితో ఈ భామ ఫన్నీ సంభాషణలు అప్పట్లో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. బిగ్‌బాస్ షో తర్వాత ఈ బ్యూటీ పలు మ్యూజిక్ ఆల్బమ్స్‌లో నటించింది.
బిగ్‌బాస్ షో నుంచి బయటకు వచ్చాక తేజస్వీకి ఆఫర్లు వరుస కట్టాయి. తరచూ తన బాయ్‌ఫ్రెండ్‌తో పార్టీలు, వెకేషన్లకు వెళ్తూ మీడియా కంట పడింది. ఈ జంటకు బీ-టౌన్‌లో చాలా క్రేజ్ ఉంది. వీళ్లకు తేజ్‌రన్ అని నిక్‌నేమ్ కూడా ఇచ్చేశారు ఫ్యాన్స్. తన బాయ్‌ఫ్రెండ్ కరణ్ కుంద్రాతో కలిసి తేజు ఓ మ్యూజిక్ వీడియోలో నటించింది.
తేజస్వీ ప్రకాశ్ రీసెంట్‌గా ఓ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. మరాఠీ మూవీ మన్ కస్తూరీ సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఈ బ్యూటీకి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. మరోవైపు తన బాయ్‌ఫ్రెండ్ కరణ్‌ను తేజస్విని తర్వలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.