Bigg Boss : స్టార్ మా ఛానల్ లో ప్రతీ ఏడాది ప్రసారమయ్యే బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్, ఈ ఏడాది కూడా సరికొత్త హంగులతో ముస్తాబై వచ్చే నెల నుండి టెలికాస్ట్ అయ్యేందుకు సిద్ధం గా ఉంది. రీసెంట్ గానే ఈ సీజన్ కి సంబంధించిన ప్రోమో ని కూడా టెలికాస్ట్ చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే.

ముందు సీజన్ లో లాగ కాకుండా, ఈ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్స్ ప్రేక్షకులకు ఎంతో ముఖ పరిచయం ఉన్న సెలబ్రిటీస్ మాత్రమే ఉండేట్టు స్టార్ మా యాజమాన్యం చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక అక్కినేని నాగార్జున గెటప్ కూడా ఈసారి ఎంత స్టైలిష్ గా ఉండబోతుందో మొన్న విడుదలైన ప్రోమో లో చూసాము. పూర్తి స్థాయి కంటెస్టెంట్స్ లిస్ట్ అధికారికంగా రాలేదు కానీ, కచ్చితంగా వీళ్ళే అని మాత్రం సోషల్ మీడియా లో ప్రచారం అవుతుంది.

అది కాసేపు పక్కన పెడితే ఈ బిగ్ బాస్ షో ని చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళ వరకు ప్రతీ వయస్సుకి సంబంధించిన వారు చూస్తూ ఉంటారు. కానీ కంటెస్టెంట్స్ ఈమధ్య కాలం లో మితిమీరి బూతులు తిట్టుకోవడాలు, రొమాన్స్ చేసుకోవడాలు,సిగరెట్లు తాగడం వంటివి చిన్న పిల్లలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని, ఈ రియాలిటీ షో పై కోర్టు లో కొంత మంది కేసులు కూడా వేశారు . అందుకే ఈసారి మాత్రం చాలా కఠినమైన రూల్స్ ని తీసుకొచ్చిందట స్టార్ మా ఛానల్.

అందులో మొదటిది ఈ సీజన్ స్మోకింగ్ జోన్ అసలు ఉండదట. అంటే సిగరెట్ తాగడం పూర్తిగా నిషిద్ధం. ఈ రూల్ ని ఎవరైనా బ్రేక్ చేస్తే మాత్రం, ఇస్తామన్న రెమ్యూనరేషన్ నుండి 30 శాతం కోతలు విదిస్తారట. అలా కోతలు విధించినా పర్వాలేదు, సిగరెట్ తాగుతాం అనుకునే వాళ్ళు తాగొచ్చు అని అన్నారట. గత సీజన్ లో సిగరెట్ కోసం బాలాదిత్య చేసిన రచ్చ ప్రేక్షకులు ఇంకా మర్చిపోలేదు. దీని ప్రభావం చాలా గట్టిగానే పడింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.