ఈరోజు థియేటర్లలోకి భారీ అంచనాల నడుమ భారతీయుడు 2 సినిమా వచ్చింది.. ఈ సినిమా ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో దూసుపోతుంది.. భారతీయుడు 2 మూవీ పై మిశ్రమ స్పందన వస్తుంది. ఈ సినిమా ఇప్పటికే యూఎస్ లో ప్రీమియర్ షోలు వేయడంతో ఈ మూవీ చూసిన జనాలు ట్విట్టర్ వేదికగా సినిమాకు రివ్యూ ఇస్తున్నారు.. అయితే అసలు శంకర్ ఈ సినిమా తియ్యడానికి గల కారణం ఏంటనే విషయం చాలా మందికి తెలియదు.. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సాదారణంగా జెంటిల్‌మెన్ మూవీ తో దర్శకుడి గా ఎంట్రీ ఇచ్చిన శంకర్ మొదటి సినిమాతోనే తన దర్శకత్వ ప్రతిభ ఎలాంటిదో ఇండస్ట్రీకి చాటి చెప్పారు. ఆ తర్వాత వచ్చిన ప్రేమికుడు సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్టే.ఇలా భారతీయుడు,జీన్స్, ఒకే ఒక్కడు, బాయ్స్, స్నేహితుడు, శివాజీ, అపరిచితుడు వంటి బ్లాక్ బాస్టర్ సినిమాలను ఆడియన్స్ కు అందించారు.. అయితే ఇప్పటివరకు ఈయన తీసిన సినిమాలు అన్ని కూడా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్నాయి.. ఏ సినిమా చేసినా కూడా మంచి హిట్ టాక్ వచ్చింది..
అదే ఓప్స్ తో ఇప్పుడు మరో కొత్త ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఈ సినిమా తియ్యడానికి కారణం కూడా ఉందట.. శంకర్ చదువుకొనే రోజుల్లో సర్టిఫికెట్ కోసం లంచం అడగడంతో ఆ దాన్నే కాన్సెప్ట్ గా తీసుకొని సినిమా చేశాడు.. అప్పుడు భారీ విజయాన్ని అందుకుంది.. ఇప్పుడు అదే సినిమాకు సీక్వెల్ గా తాజాగా భారతీయుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. లంచం, అవినీతి, అక్రమాలకు సంబంధించిన స్టోరీనే ఉంటుంది. ఈ సినిమాని ముందుగా రజినీకాంత్ తో అనుకున్నప్పటికీ అది కుదరలేదు.ఆ తర్వాత తండ్రి పాత్రలో రాజశేఖర్ కొడుకు పాత్రలో వెంకటేష్ ని తీసుకున్నాడని భావించాడు ఆయన డేట్స్ కుదర మళ్లీ కమల్ తోనే సినిమా అని తెలుస్తుంది… ఇక ఈ సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి..