Bharateeyudu 2 కమల్ హాసన్ – శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘భారతీయుడు 2 ‘ చిత్రం ఇటీవలే పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాల నడుమ గ్రాండ్ గా విడుదలైన సంగతి తెలిసిందే. ఇన్నేళ్ల కెరీర్ లో అపజయం అనేదే ఎరుగని శంకర్ కి ఈ చిత్రం ద్వారా కోలుకోలేని స్థాయిలో డిజాస్టర్ ని ఎదురుకోవాల్సి వచ్చింది. ఇండియన్ లాంటి కల్ట్ క్లాసిక్ చిత్రాన్ని తెరకెక్కించిన శంకర్, ఆ చిత్రానికి సీక్వెల్ ని ఇంత చెత్తగా తీస్తాడని ప్రేక్షకులు కలలో కూడా ఊహించి ఉండరు. శంకర్ అభిమానులకు అయితే ఈ చిత్రాన్ని చూసి కన్నీళ్లు కూడా వచ్చునంటాయి.
అసలు ఈ సినిమాకి దర్శకత్వం వహించింది నిజంగా శంకర్ యేనా అనే అనుమానం ప్రతీ ఒక్కరిలో రావడం సర్వ సాధారణం. అంత దారుణంగా తీసాడు, కానీ శంకర్ కి ఉన్న బ్రాండ్ విలువ ఒక సూపర్ స్టార్ హీరో కంటే పెద్దది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.అందుకే ఈ సినిమాని ఇంత చెత్తగా తీసినా కూడా పరువు తీసే స్థాయి కలెక్షన్స్ ని ఇవ్వలేదు జనం. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి 21 కోట్ల రూపాయిల థియేట్రికల్ బిజినెస్ జరిగితే పది రోజులకు కలిపి 14 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్ లో మరో కోటి రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. ఇంతటి డిజాస్టర్ సినిమాకి కేవలం ఆరు కోట్ల రూపాయిల నష్టం అంటే పెద్ద విషయమేమి కాదు.
అలాగే వరల్డ్ వైడ్ వసూళ్లు కూడా పర్వాలేదు అనే స్థాయిలో ఉన్నాయి. ఒక్కసారి ప్రాంతాల వారీగా గ్రాస్ వసూళ్లను పరిశీలిస్తే తమిళనాడు లో ఈ చిత్రానికి 10 రోజులకు గాను 49 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్లో 23 కోట్ల రూపాయిల గ్రాస్, కర్ణాటక లో 9 కోట్ల రూపాయిలు, కేరళలో 5 కోట్ల 60 లక్షల రూపాయిలు, హిందీ లో 8 కోట్ల రూపాయిలు, ఓవర్సీస్ లో 50 కోట్ల రూపాయిలు గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 145 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, 70 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్ లో మరో 5 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది.