bharateeyudu 2 సౌత్ ఇండియా లో సూపర్ స్టార్స్ తో సరిసమానమైన ఇమేజి ఉన్న ఇద్దరు ముగ్గురు దర్శకులలో ఒకడు శంకర్. ఆయన సినిమా అంటే ఒక బ్రాండ్. సామజిక అంశాలను తీసుకొని, కమర్షియల్ హంగులు అద్ది, శంకర్ తెరకెక్కించిన సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో రీసౌండ్ వచ్చే రేంజ్ బ్లాక్ బస్టర్ అయ్యాయి. అలాంటి బ్లాక్ బస్టర్స్ లో ఒకటి భారతీయుడు(ఇండియన్). ఈ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన భారతీయుడు 2 చిత్రం మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎప్పుడో ఐదేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా అనేక ఒడిదుడుకులను ఎదురుకొని మొత్తానికి ఇప్పుడు పూర్తి చేసుకుంది. ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
నిన్న ఈరోజు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయి. శంకర్ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరగకపోయినప్పటికీ, మంచి అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ నడుస్తుందనే చెప్పొచ్చు. ఇదంతా పక్కన పెడితే ఇండియన్ 2 కి ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది. ఈ సినిమా విడుదలను ఆపాలి అంటూ అసాన్ రాజేంద్రన్ అనే వ్యక్తి మదురై జిల్లా కోర్టుని ఆశ్రయించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మా అనుమతి తీసుకోకుండా మర్మ కళ టెక్నీక్స్ ని ఈ సినిమాలో చూపించాడు డైరెక్టర్ శంకర్. థియేట్రికల్ విడుదలతో పాటుగా, ఓటీటీ విడుదలని కూడా నిషేధించాలి’ అంటూ కోర్టులో పిటీషన్ వేశారు.
దీనికి నిర్ణీత సమయంలో వివరణ ఇవ్వాలని ఇండియన్ 2 టీం ని కోర్టు కోరుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నో అడ్డంకులను దాటుకొని ఇక్కడ దాకా వచ్చిన ఇండియన్ 2 ,ఈ చివరి నిమిషం లో వచ్చిన ఈ సమస్య ఎక్కడ వరకు దారి తీస్తుందో చూడాలి. ఇకపోతే మరోపక్క మూవీ టీం ప్రొమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటుంది. ఎవ్వరూ కూడా ఈ కేసు అంశం గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. తెలుగు ప్రెస్ మీట్ లో కూడా ఈ అంశం తెర మీదకు రాలేదు. ఈ కేసు సినిమా విడుదలకు ఎక్కడ అడ్డుకట్ట వేస్తుందో అని మేకర్స్ లో భయం అయితే ఉంది. ఈరోజు ఈ కేసు కి సంబంధించి మూవీ టీం వివరణ ఇచ్చే అవకాశం ఉంది.