Ananth Ambani Marriage : నేడు ముంబై లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం ఎంత గ్రాండ్ గా జరిగిందో మన అందరికీ తెలిసిందే. ఈ వివాహ వేడుకకు బాలీవుడ్, టాలీవుడ్ నుండి ఎంతోమంది ప్రముఖులు ఈ వేడుకకు హాజరు అయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వంటి వారికి ప్రత్యేకమైన ఆహ్వానం దక్కింది కానీ, బిజీ షెడ్యూల్స్ వల్ల వాళ్ళు రాలేకపోయారు. టాలీవుడ్ నుండి సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, అక్కినేని అఖిల్ వంటి వారు హాజరు కుటుంబ సమేతంగా హాజరు అయ్యారు. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ పెళ్లి వేడుక లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
పొడవాటి జుట్టుతో, మీసం గెడ్డంతో హాలీవుడ్ హీరో లాగ కనిపించిన మహేష్ లుక్స్ సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి. ఆయన తన తదుపరి చిత్రం రాజమౌళి తో చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకి సంబంధించిన లుక్ ఇదేనట. గెడ్డం ఇంకా పెంచుతాడట. అలా ఒక్కసారిగా మహేష్ ఈవెంట్ లో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా మారిపోయాడు. మరోపక్క కోలీవుడ్ నుండి సూపర్ స్టార్ రజినీకాంత్ అతిధి గా రావడమే కాకుండా, వధూవరులతో కలిసి డ్యాన్స్ చెయ్యడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
రజినీకాంత్ బయట ఈవెంట్స్ లో ఎక్కడా కూడా ఇలా డ్యాన్స్ వెయ్యడం ఇది వరకు ఎవ్వరూ చూడలేదు. అలాంటిది అనంత్ అంబానీ పెళ్ళిలో డ్యాన్స్ వెయ్యడం ని చూసి అసలు ఈయన రజినీకాంత్ యేనా అని అందరూ ఆశ్చర్యపోయారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా డ్యాన్స్ కూడా ప్రత్యేక ఆకర్షణ గా నిల్చింది. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, రణబీర్ కపూర్, కృతి సనన్, కత్రినా కైఫ్ ఇలా ఎంతో మంది ప్రముఖులు ఈ ఈవెంట్ కి హాజరయ్యారు.