Anchor Anasuya : బుల్లితెర మీద స్టార్ యాంకర్ గా ఒక మంచి స్థాయికి చేరుకున్న అనసూయ, ఆ తర్వాత నటిగా కూడా మంచి గుర్తింపుని దక్కించుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. పుష్ప సినిమా తో ఆమె పాన్ ఇండియా రేంజ్ కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత పలువురి స్టార్ హీరోల సినిమాల్లో ముఖ్యపాత్రలు పోషిస్తున్న అనసూయ, అప్పుడుడప్పుడు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా నటిస్తూ ఉంటుంది. అయితే సోషల్ మీడియా లో ఎల్లప్పుడూ ఎదో ఒక కాంట్రవర్సీ లో ఉండే అనసూయ, ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ విషయం లో పలుసార్లు పలురకాల కామెంట్స్ చేసి సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రోల్ల్స్ కి గురైన సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘సింబా’ చిత్రానికి సంబంధించి ఒక ట్రైలర్ విడుదల అయ్యింది.
ఈ ట్రైలర్ లో ఒక వ్యక్తి ఆమె వద్దకు వచ్చి, స్కూటీ ని తుడుస్తూ అక్కా నీకు మహేష్ బాబు లాంటి మొగుడు వస్తాడు అని అంటాడు. దానికి అనసూయ నాకు అవసరం లేదు అని అంటుంది. అప్పుడు అతను విజయ్ దేవరకొండ లాంటి భర్త వస్తాడు అంటే సిగ్గుతో నవ్వుతుంది. ట్రైలర్ లో ఉన్న ఈ బిట్ గురించి ఒక విలేఖరి అనసూయ ని అడుగుతూ మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవలు చెరిగిపోయాయి అని అనుకోవచ్చా? అని అంటాడు. అప్పుడు అనసూయ దానికి సమాధానం చెప్తూ, ఇప్పుడు ఆ సంఘటన కి నేను ప్రాముఖ్యత ఇవ్వాలని అనుకోలేదు.
ఒక హీరో అయ్యుండి పబ్లిక్ స్టేజి మీద అలా మాట్లాడడం తప్పు, మీకెవ్వరికి అది తప్పు అనిపించలేదా అని అన్నాను, అందులో నాకు ఎలాంటి తప్పు కనిపించలేదు అని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా ఈ చిత్రం లో కూడా ఈ డైలాగ్ ని డైరెక్టర్ పెడితే ఫన్ గా ఉంటుంది అంటే సరే అని ఒప్పుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది అనసూయ..ఇదంతా పక్కన పెడితే ఈ ట్రైలర్ బాగా వైరల్ అయ్యింది. మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ ని పక్కన పెట్టి, విజయ్ దేవరకొండ నీకు మొగుడుగా కావాలా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అనసూయ ని ట్రోల్ చేస్తున్నారు.