Kalki 2898 AD భారీ అంచనాల మధ్య ఇటీవలే విడుదలైన ప్రభాస్ కల్కి చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్ గా నిల్చి, వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వైపు పరుగులు తీస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ వీకెండ్ లోనే ఈ చిత్రం వెయ్యి కోట్ల రూపాయిలు కొల్లగొట్టే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం ఎవరు అనే చర్చలు సోషల్ మీడియా లో జోరుగా కొనసాగుతున్నాయి. సినిమాకి ప్రభాస్ హీరో కాబట్టి, ఆయన పేరు మీదనే ఇంత రన్ వస్తుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ ఈ చిత్రం లో ప్రభాస్ క్యారక్టర్ ని అమితాబ్ బచ్చన్ క్యారక్టర్ పూర్తిగా డామినేట్ చేసింది అనేది చూసిన ప్రతీ ఒక్కరికి అర్థమైంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ చిత్రానికి హీరో అమితాబ్ బచ్చన్ అని సోషల్ మీడియా లో అనేకమంది కామెంట్లు చెయ్యడం ఇది వరకు మనం చూసే ఉంటాము.
అయితే ఈ చిత్ర నిర్మాత అశ్వినీదత్ కూడా అదే తరహా కామెంట్లు చెయ్యడం పై ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియా లో తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. రీసెంట్ గా అశ్వినీ దత్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ ఆయనకు ఒక ప్రశ్న వేస్తూ ‘ఒక్క సూపర్ హిట్ సినిమా, ఇంత వసూళ్లను రాబట్టడానికి కారణం ఎవరో ఒకరు అనిపిస్తుంది కదా, అలా మీకు ఈ సినిమాకి ఎవరు అనిపించారు?’ అని అడగగా దానికి అశ్వినీ దత్ సమాధానం చెప్తూ ‘మేమంతా అమితాబ్ బచ్చన్ వల్లే ఈ చిత్రానికి ఈ రేంజ్ వచ్చిందని అనుకుంటున్నాము’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఆయన మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యి ట్రోల్ల్స్ కి గురి అవుతుండడంతో ప్రభాస్ అభిమానులు నిర్మాతపై ఫైర్ అవుతున్నారు. ప్రభాస్ కి ఇలా వందల కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టడం కొత్తేమి కాదని, అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్ గా చేసిన ఈమధ్య సినిమాలలో ఈ స్థాయి వసూళ్లు దేనికైనా వచ్చాయా అని నిలదీస్తున్నారు. మరోపక్క బాలీవుడ్ అభిమానులు చెప్పేది ఏమిటంటే అమితాబ్ ని ఇన్ని రోజులు దర్శకులు ఇంత పవర్ ఫుల్ గా చూపించడం లో విఫలం అయ్యారని, అలాంటి అమితాబ్ బచ్చన్ ని వింటేజ్ యాక్షన్ సన్నివేశాల్లో చూపించే లోపు బాలీవుడ్ లో కాసుల కనకవర్షం కురుస్తుందని వాదిస్తున్నారు.