Amala Akkineni : సౌత్ ఇండియాలోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లిస్ట్ తీస్తే అందులో నాగార్జున – అమల జంట ముందు వరుసలో ఉంటుంది. శివ సినిమాతో పరిచయమైనా వీళ్లిద్దరి స్నేహం, ఆ తర్వాత ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. ఈమధ్య కాలం లో చిన్న చిన్న వాటికే అపార్థం చేసుకొని విడిపోతున్నారు. అలాంటిది మూడు దశాబ్దాల దాంపత్య జీవితం లో ఎలాంటి మనస్పర్థలు లేకుండా ఇంత అన్యోయంగా ఒకరికోసం ఒకరు బ్రతకడం అనేది మామూలు విషయం కాదు.
అయితే అమలకి ముందు నాగార్జున వెంకటేష్ సోదరి లక్ష్మీ దగ్గుపాటి ని పెళ్లి చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఈమెతో కొన్నాళ్ళు దాంపత్య జీవితం నడిపి ఆ తర్వాత కొన్ని విభేదాల కారణంగా విడిపోవాల్సి వచ్చింది. ఇదంతా పక్కన పెడితే నాగార్జున అమల ఎంత పాజిటివ్ మహిళా అనేది ఆయన నోటితోనే ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొస్తాడు.
ఈ ఇంటర్వ్యూ లో నాగార్జున ఓపెన్ గానే తన అఫైర్స్ గురించి మాట్లాడుతాడు. నాకు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఒకరితో బ్రేకప్ అయిపోగానే ఇంకొకరు వచ్చేవారు నాకు, ఎప్పుడూ కూడా గర్ల్ ఫ్రెండ్ లేకుండా లేను నేను, ఇవన్నీ అమలకి తెలుసు. కానీ ఆమె చాలా పాజిటివ్ పర్సన్, ప్రతీ విషయాన్నీ అర్థం చేసుకుంటాది, ఈ సంఘటనలు తెలిసినప్పుడు చిన్న చిరునవ్వు నవ్వి ఊరుకుంటుంది అని చెప్పుకొచ్చాడు నాగార్జున.
అయితే నా గర్ల్ ఫ్రెండ్స్ తో నేను చాలా లిమిట్ గా ఉండేవాడిని, అసలు ఫిజికల్ రిలేషన్ షిప్ పెట్టుకునే వాడిని కాదు, వాళ్లందరితో ఇప్పటికీ నేను మంచి రిలేషన్ ని మైంటైన్ చేస్తున్నాను. గుర్తుకు వచ్చినప్పుడల్లా ఫోన్ చేసి మాట్లాడుతాను, వాళ్ళు నాతో చాలా కంఫర్ట్ గా మాట్లాడడానికి ఇష్టపడుతారు అంటూ చెప్పుకొచ్చాడు నాగార్జున. ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.