Akkineni Nagarjuna : అక్కినేని నాగేశ్వర రావు, అక్కినేని నాగార్జున తర్వాత మూడవ తరం నుండి అక్కినేని కుటుంబం నుండి వచ్చిన హీరోలలో మంచి మార్కెట్ ని సంపాదించుకున్న నటుడు అక్కినేని నాగ చైతన్య. యూత్ ఫుల్ మూవీస్ తీస్తూ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకున్న నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ అనే భారీ బడ్జెట్ చిత్రం లో నటిస్తున్నాడు. ఇదంతా పక్కన పెడితే నాగ చైతన్య తన వ్యక్తిగత జీవితం లో ఎంతో సింపుల్ గా బ్రతికే మనిషి అనే విషయం మన అందరికీ తెలిసిందే. అతని గురించి ఆయన తండ్రి నాగార్జున రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. నాగార్జున ప్రముఖ నిర్మాత రామానాయుడు కూతురు, వెంకటేష్ సోదరి లక్ష్మి ని వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.
లక్ష్మి, నాగార్జున దంపతులకు పుట్టిన సంతానమే నాగ చైతన్య. అయితే కొన్ని అనుకోని సంఘటనల వల్ల వాళ్ళిద్దరి మధ్య విబేధాలు ఏర్పడి విడిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్ళకు నాగార్జున తన తోటి హీరోయిన్ అమలాని వివాహం చేసుకున్నాడు. ఇదంతా పక్కన పెడితే నాగ చైతన్య బాల్యం లో తనతో లేడు అనే బాధ నాగార్జున లో ఇప్పటికీ అలాగే ఉందట. లక్ష్మీ తో విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్య కూడా ఆమెతో కలిసి అమెరికా కి వెళ్ళిపోయాడట, తన విద్యాబ్యాసం మొత్తం అక్కడే చేసేవాడట, కేవలం అప్పుడప్పుడు మాత్రమే నాగార్జున వద్దకి వచ్చేవాడట. కానీ సెకండరీ ఎడ్యుకేషన్ పూర్తి అయినా తర్వాత నాగ చైతన్య నాగార్జున వద్దే పెరిగాడట.
కానీ నాగ చైతన్య అంటే ఎంతో ప్రేమ ఉండే నాగార్జున కి, చైతన్య బాల్యం తనతో గడపలేదు అనే బాధ ఇప్పటికీ వెంటాడుతూనే ఉందని నాగార్జున రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇక నాగ చైతన్య సినిమాల విషయానికి వస్తే, మజిలీ చిత్రం తర్వాత వరుసగా 5 సూపర్ హిట్స్ అందుకున్న అతనికి, థాంక్యూ మరియు కస్టడీ చిత్రాలు వరుసగా నిరాశపర్చాయి.
ఇప్పుడు ఆయన కార్తికేయ ఫేమ్ చందు మొండేటి తో ‘తండేల్‘ అనే చిత్రం చేస్తునందు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. వరుసగా డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలను చూస్తున్న అక్కినేని ఫ్యామిలీ ఈ చిత్రం పైన ఆశలు భారీగానే పెట్టుకున్నాయి. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.