Abbas : ప్రేమదేశం మూవీతో సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అబ్బాస్ అతి స్వల్ప కాలంలో ఎన్నో చిత్రాలలో నటించి స్టార్ డం సొంతం చేసుకున్నాడు. ఒకప్పటి అమ్మాయిల కలల రాకుమారుడు అయిన ఈ నటుడు ఆ తరువాత కెరియర్లో అవకాశాలు లేక ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని చివరికి పొట్టకూటి కోసం డ్రైవర్గా కూడా పని చేయాల్సి వచ్చిందట.

2015 నుంచి సుమారు 8 ఏళ్ల పాటు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈ హీరో రీసెంట్ గా న్యూజిలాండ్ నుంచి తిరిగి వచ్చారు. ఇక్కడ ఉండలేక ,ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక న్యూజిలాండ్ వెళ్లిన అబ్బాస్ అక్కడ టాక్సీ డ్రైవర్ గా చివరికి మెకానిక్ గా కూడా పనిచేశానని ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఒకానొక సమయంలో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్య కూడా చేసుకోవాలి అని అతను భావించినట్లు చెప్పారు.

19 సంవత్సరాల వయసులో సంపాదన కోసం సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అబ్బాస్ అతి స్వల్ప కాలంలో పాపులర్ అయ్యారు. ఆ తరువాత ఫ్లాపులు, తగ్గిన అవకాశాలు కారణంగా చాలా సినిమాలలో మెయిన్ హీరోగా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించారు. కానీ ఇక ఇండస్ట్రీలో ఉండడం కష్టమని భావించిన అబ్బాస్ చివరికి ఇండస్ట్రీకి దూరంగా వెళ్లారు. కుటుంబాన్ని పోషించడం కోసం మెకానిక్ గా డ్రైవర్ గా పనిచేస్తూ న్యూజిలాండ్ లో జీవితాన్ని గడిపి ఈమధ్య ఇండియాకు తిరిగివచ్చారు
.అబ్బాస్ తో పాటు అదే ప్రేమదేశం సినిమాలో నటించిన వినీత్ మరియు టబూ మాత్రం మంచి అవకాశాల్ని అందుకోవడమే కాకుండా తమ కెరియర్ లో ఎంతో సక్సెస్ఫుల్గా ఉన్నారు. కానీ ఒక్క అబ్బాస్ తన కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవడమే కాకుండా ఆర్థిక ఇబ్బందుల్లో కూడా సతమతమయ్యారు. అందుకే ఈ రంగుల ప్రపంచం అందరికీ అచ్చి వస్తుంది అన్న గ్యారంటీ లేదు అని పలువురు అంటూ ఉంటారు.