Ram Charan : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి , సినిమానే లోకం అన్నట్టుగా తన జీవితాన్ని గడుపుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే..కానీ ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండడం వల్ల అప్పుడప్పుడు చిరంజీవి ని కూడా రాజకీయాల్లోకి లాగి ఆయన మీద కామెంట్స్ చేస్తూ ఉంటారు ప్రత్యర్థులు..గత కొద్దీ రోజుల క్రితమే మంత్రి రోజా మెగా ఫ్యామిలీ పై చేసిన కామెంట్స్ ఎంత దుమారం రేపాయో మన అందరికీ తెలిసిందే.
చిరంజీవి కుటుంబం ఎవరికీ సహాయం చెయ్యలేదని..వాళ్ళు అలా ఉన్నారు కబట్టు ముగ్గురు అన్నదమ్ములను జనాలు ఓడించారని కామెంట్ చేసింది..దీనిపై నాగ బాబు మరియు పవన్ కళ్యాణ్ తో పాటుగా మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించాడు..ఇక నిన్న జరిగిన ‘వాల్తేరు వీరయ్య’ విజయోత్సవ సభ కి ముఖ్య అతిధిగా హాజరైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా దీనిపై పరోక్షంగా చాలా ఘాటు వ్యాఖ్యలే చేసాడు.
రామ్ చరణ్ మాట్లాడుతూ ‘చిరంజీవి గారిని అందరూ సౌమ్యుడు అని అంటూ ఉంటారు.. ఆయన సౌమ్యం గా ఉంటేనే ఇంత మంది ఉన్నారు.. ఒక్కసారి ఆయన కన్నెర్ర చేసి బలంగా బిగిస్తే ఇక ఏ స్థాయిలో ఉంటుందో మీరే ఊహించుకోండి.. ఆయన సౌమ్యం గా ఉన్నప్పటికీ నేను ఉండను.. మా అభిమానులు అయితే అసలు ఉండరు.. కాబట్టి ఇక నుండి ఆయనని అనేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి’ అంటూ రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం గా మారాయి.. పేర్లు ప్రస్తావించకుండా మాట్లాడినప్పటికీ ఎవరెవరికి తాకలో వాళ్లకి అర్థం అయ్యేట్టు రామ్ చరణ్ చాలా గట్టి సమాధానమే ఇచ్చాడు.. ఈ మాటలు కేవలం రోజా కి మాత్రమే కాదు.. చాగంటి కి కూడా వర్తిస్తాయి అని అంటున్నారు మెగా ఫ్యాన్స్.