Pavitra Naresh : వామ్మో రమ్యను ప్రూఫ్స్ తో సహా మీడియా ముందు బుక్ చేసిన నరేష్..

- Advertisement -

Pavitra Naresh : సీనియర్ నటుడు నరేష్ తన మూడో భార్య రమ్య రఘుపతి పై సంచలన వ్యాఖ్యాలు చేశారు. ఈ మేరకు మీడియా ముందుకు వచ్చి గతంలో తను చేసిన కుట్రలన్నింటినీ బయటపెట్టారు.. ఆస్తి కోసం తనను చంపేందుకు రమ్య ప్రయత్నించిందని నరేష్ సంచలన ఆరోపణలు చేశారు. కాగా నరేష్ మీడియాతో నువ్వు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రమ్య నన్ను చంపడానికి గ్యాంగ్ తయారు చేసిందని నరేష్ మీడియా ముందుకి వచ్చి చెప్పారు. తను మా ఇంట్లో ఉన్నప్పుడు వంట చేసేవారిలో ఒకరిని బీహార్ నుంచి ఒకరిని పిలిపించిందని.. వారితో తను ఎలాంటి ప్లాన్ వేసిందో కూడా తనకి తెలుసని నరేష్ ఆరోపించారు. నేను చచ్చిపోతే పోలీసులకు కంప్లైంట్ ఎవరు ఇవ్వాలి. భార్య ఇవ్వాలి. తను కంప్లైంట్ ఇవ్వకపోతే.. తనకు వందల కోట్ల ఆస్తి వస్తుంది. ఎంత సిగ్గుచేటు.. ఎంత డేంజరస్.. రమ్య నే నాతో చాలాసార్లు డేంజరస్ గా ఆలోచిస్తానని చెప్పింది.

Pavitra Naresh
Pavitra Naresh

రఘువీరా రెడ్డి కూడా తను క్రిమినల్ గా ఆలోచిస్తున్నానని తనతో చెబుతారని రమ్య సంతోషంగా చెప్పుకునేది.. విజయనిర్మల దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయినా తను సింపతి చూపించి.. అక్కడ జాయిన్ అయ్యిందని .. రమ్యకు నేనే ఆఫర్ ఇచ్చాను.. తన సింపతిని చూసి నీకు ఇష్టమైతే నేను పెళ్లి చేసుకుంటానని అన్నాను..

- Advertisement -

అప్పటివరకు నాకు ఆ విషయం తెలియలేదు నేను తన ట్రాప్ లో ఉన్నానని.. తర్వాత అర్థమైంది కానీ మేమిద్దరం ప్రేమించుకుందాం.. కలిసి తిరిగాం.. పెళ్లి చేసుకున్నాం.. మా అమ్మ నేను ఒంటరినైపోతానేమోనన్న బాధతో ఈ పెళ్లి సంబంధం చూసింది.. నాతో పెళ్లి చేసుకోవడానికి ముహూర్తం ఫిక్స్ అయిన రోజు రాత్రి రమ్య ఒక పబ్ లో ఫుల్ గా తాగేసి తన ఎక్స్ ఫియాన్సితో కలిసి గొడవ పడింది.

తన చేతికి గాయమై బ్లడ్ కూడా వచ్చింది.. కానీ తను పోలీస్ కంప్లైంట్ చేయలేదు . ఈ విషయాన్ని రఘువీరారెడ్డిని కూడా అడుగుతాను అని నరేష్ మీడియా ముందు అన్నారు. రమ్య రఘుపతి టార్గెట్ ఏంటంటే నా దగ్గర నుంచి డబ్బులు లాక్కోవడం లేదంటే నన్ను చంపేయడం. 10 కోట్లు ఇస్తే రమ్య రఘుపతి కాంప్రమైజ్ అవ్వడానికి రెడీ అంటూ మాట్లాడిన‌ ఫోన్ కాల్ వినిపించారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here