Pavitra Naresh : నరేష్ – పవిత్రల పెళ్లికి లైన్ క్లియర్..10కోట్లతో సెటిల్మెంట్..?



గత కొద్ది రోజులుగా సీనియర్ హీరో నరేష్, పవిత్ర ( Pavitra Naresh ) రమ్య రఘుపతి ల గురించి అనేక వార్తలు వైరల్ అయ్యాయి..వీరి హైడ్రామాలో ఎన్నో ట్విస్టులు బయటకు వచ్చాయి.రమ్యతో తనకు ప్రాణహాని ఉందంటూ కోర్టును ఆశ్రయించారు నరేష్‌. తనను చంపేందుకు తన ఇంటి దగ్గర రెక్కీ చేయించిందంటూ కోర్టులో పిటిషన్‌ వేశారు నరేష్‌. కర్నాటక రౌడీ రాకేష్‌శెట్టితో రెక్కీ చేయించిందని, కృష్ణ మరణించిన సమయంలో ఈ రెక్కీ జరిగిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

Naresh Ramya Raghupathi

అంతేకాదు, ఓ పోలీస్‌ ఆఫీసర్‌ సాయంతో తన ఫోన్‌ హ్యాక్‌ చేయిందని అన్నారు..అంతేకాదు తన బంధువు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి పేరుతో బెదిరింపులకు దిగింది రమ్య రఘుపతి.. ఇక రమ్య కూడా నరేష్ ఒక కామాంధుడు అంటూ వాదనలు వినిపించింది.. వీరిద్దరి వాదనలను కోర్టు పరిగణలోకి తీసుకొని విచారణ జరిపింది..

pavitra Naresh
Pavitra Naresh

ఇది ఇలా ఉండగా తాజాగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది..10కోట్ల రూపాయలు ఇస్తే సెటిల్‌మెంట్‌ చేసుకుంటానంటూ మధ్యవర్తితో బేరసారాలు చేసింద‌ట‌ రమ్య. ఈ బెదిరింపులకు సంబంధించిన కీలక ఆధారాలు ఓ ప్రముఖ ఛానెల్ కు దొరికాయ‌ట‌. ఇక నరేష్ కూడా మరోసారి రమ్య మీద ఆరోపణలు చేశారు.. పెళ్లైన తర్వాతి నెల నుంచే తనను వేధించడం మొదలుపెట్టిందంటూ సీక్రెట్స్‌ను బయటపెట్టారు. తిండి పెట్టేది కాదని, కొడుకును కొట్టేదని చెప్పుకొచ్చారు. ఫంక్షన్ ఏదైనా సరే తాగి రచ్చరచ్చ చేసేదన్నారు. రమ్యకి తనపై కంటే డబ్బు మీద ఎక్కువ ఇష్టం ఉండేది, డబ్బులు సంపాదించడం పైనే ఎక్కువ ఆలోచనలు ఉండేవి.. ఇప్పుడు అందుకే సైలెంట్ అయ్యింది అంటూ నరేష్ అన్నారు.నరేష్ పవిత్రలకు లైన్ క్లియర్ అయినట్లే.. త్వరలోనే నరేష్ పవిత్రల పెళ్లి చేసుకోబోతున్నారని టాక్..