Krish Pradeep విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను ఊర్రూతలూ ఊగించే విధమైన చిత్రాలు తియ్యగల అతి తక్కువమంది దర్శకులలో ఒకరు కృష్ణ వంశీ. గులాబీ, నిన్నే పెళ్లాడట, సింధూరం, ఖడ్గం, మురారి ఇలా ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించిన కృష్ణ వంశీ నుండి తెరకెక్కిన మరో అద్భుతమైన చిత్రం అంతఃపురం. సౌందర్య ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం లో జగపతి బాబు 15 నిమిషాల ముఖ్యమైన పాత్రలో కనిపించగా, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో నటించాడు. ఈ సినిమాలో అద్భుతమైన నటన కనబర్చినందుకు గాను సౌందర్య కి ఉత్తమ నటిగా , అలాగే జగపతి బాబు కి ఉత్తమ సహాయనటుడిగా నంది అవార్డులు దక్కాయి.
ఇక ప్రకాష్ రాజ్ కి అయితే ఏకంగా స్పెషల్ క్యాటగిరీ క్రింద ఈ సినిమాలో అద్భుతమైన నటన కనబర్చినందుకు గాను నేషనల్ అవార్డు కూడా దక్కింది. డైరెక్టర్ కృష్ణ వంశీ కి ఫిలిం ఫేర్ అవార్డు దక్కింది. ఇకపోతే ఈ చిత్రం లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన మాస్టర్ క్రిష్ ప్రదీప్ గురించి మాట్లాడుకోకుండా ఉండలేము. కథలో సౌందర్య తో సమానంగా స్క్రీన్ టైం ఉన్నది ఈ బుడ్డోడికే. అద్భుతమైన నటనతో చిన్నతనం లోనే ఇంతా ప్రతిభ ఉందా అని ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపోయేలా చేసాడు. ముఖ్యంగా సౌందర్య స్పృహ తప్పి పడిపోయినప్పుడు ఈ కుర్రాడి నటనని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు.
ఈ చిత్రం తర్వాత ఇతనికి బాలనటుడిగా అనేక అవకాశాలు వచ్చాయి కానీ, అతని తల్లితండ్రులు చదువు పాడు అవ్వకూడదు అనే ఉద్దేశ్యంతో సినిమాలకు దూరంగా పెంచారు. ఇప్పుడు కెరీర్ లో ఒక స్థాయికి వచ్చిన తర్వాత సినిమాల్లోకి రావాలని అనుకుంటున్నాడు క్రిష్ ప్రదీప్. రామ్ చరణ్ నిర్మాతగా, నిఖిల్ హీరో గా ఇండియా హౌస్ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈమధ్య కాలం లోనే హంపీ లో ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమాలను జరుపుకుంది. ఈ సినిమాలో క్రిష్ ప్రదీప్ కి ఒక మంచి క్యారక్టర్ దొరికిందట. ఈ సినిమా ద్వారా నటనతో తనని తాని నిరూపించుకుంటే, భవిష్యత్తులో హీరో గా కూడా చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి హీరోలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఉన్న క్రిష్ ప్రదీప్, భవిష్యత్తులో హీరో గా సక్సెస్ అవుతాడో లేదో చూడాలి.