Game Changer : సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన ఇండియన్ 2 చిత్రం ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 1996 వ సంవత్సరం లో ‘ఇండియన్’ చిత్రం దేశ వ్యాప్తంగా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో మన అందరికీ తెలిసిందే. ఆ సమయంలోనే ఈ చిత్రానికి సీక్వెల్ చేసి ఉంటే వర్కౌట్ అయ్యేదేమో కానీ, శంకర్ సృష్టించిన ట్రెండ్ ని, ఆయనే అనుసరించడం వల్ల ఈ చిత్రానికి ఈ స్థాయి డిజాస్టర్ ఫలితం వచ్చింది. మొదటి వీకెండ్ కాంబినేషన్ క్రేజ్ వల్ల మంచి ఓపెనింగ్స్ దక్కాయి కానీ, నిన్నటి నుండి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ పతనం ఊహించిన దానికంటే ఎక్కువగా జరుగుతుంది.
ఇన్ని దశాబ్దాల శంకర్ కెరీర్ లో ఈ స్థాయి డిజాస్టర్ ఫ్లాప్ తగలడం ఇదే మొదటిసారి. ఈ సినిమా ఇంత పెద్ద డిజాస్టర్ అవ్వడానికి కారణం పాత కాలం స్క్రీన్ ప్లే, టేకింగ్ తో పాటు, సినిమా నిడివి కూడా. ఈ చిత్రం నిడివి దాదాపుగా మూడు గంటల సమయం ఉంటుంది. ఆ రన్ టైం కి బ్లాక్ బస్టర్ టాక్ వస్తేనే జనాలు కదలడం కష్టం, అందులో డిజాస్టర్ టాక్ వస్తే ఇంకేమైనా ఉందా. ఈ భయం ఇండియన్ 2 తో శంకర్ లో కూడా మొదలైంది. ఈ చిత్రం తో పాటుగా ఆయన రామ్ చరణ్ తో గేమ్ చేంజర్ అనే చిత్రం కూడా చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ మధ్య కాలం లోనే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి అయ్యింది.
అయితే సినిమా నిడివి రెండు గంటలు మించకుండా ఉండేలా శంకర్ లేటెస్ట్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆ రెండు గంటల్లోను కథలోని ముఖ్య అంశాలు చాలా క్రిస్పీ గా ఉండేలా శంకర్ పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. అంతే కాకుండా కొన్ని సన్నివేశాలకు రీ షూట్ అవసరమైతే కచ్చితంగా చేసేందుకు కూడా శంకర్ సిద్ధంగా ఉన్నాడట. ఇండియన్ 2 ఫ్లాప్ అనుభవం తో శంకర్ ప్రతీ విషయాన్నీ పరిగణలోకి ఎలా అయినా భారీ కం బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడట. ఈ ఏడాది నవంబర్ నెలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట.