Aman Preet Singh : టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. ప్రముఖ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ఈరోజు డ్రగ్స్ తో పోలీసులకు పట్టుబడ్డాడు. ఆయనతో పాటుగా పలువురు సెలెబ్రిటీలను అలాగే వీళ్ళతో పాటు ఉన్న 5 మంది నైజీరియాన్స్ ని కూడా పోలీసులు అరెస్ట్ చేసారు. ఒక స్టార్ హీరోయిన్ కుటుంబానికి చెందిన వాడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడడంతో సోషల్ మీడియా లో సెన్సేషనల్ టాపిక్ గా మారింది. కస్టడీ లో ఉన్న అమన్ ప్రీత్ సింగ్ ని పోలీసులు విచారిస్తున్నారు. డ్రగ్స్ కి సంబంధించి రకుల్ ప్రీత్ సింగ్ కి కూడా కనెక్షన్ ఉందా అనే కోణం లో పోలీసులు ఆరా తీస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ కి సంబంధించిన వ్యాపారాలు ఎక్కువగా అమన్ ప్రీత్ సింగ్ పర్యవేక్షిస్తూ ఉంటాడు.
ఆమెకి హైదరాబాద్ లో మూడు జిమ్ లు, ఒక పెద్ద రెస్టారంట్ ఉంది. ఎంతో మంది హీరోయిన్లు, హీరోలు జిమ్ కి వస్తూ ఉంటారు. వాళ్లకి అమన్ ప్రీత్ సింగ్ బాగా పరిచయస్తుడే. కాబట్టి వీళ్ళు కూడా డ్రగ్స్ కేసు లో చిక్కుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. అందుతున్న సమాచారం ప్రకారం టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ కి బాగా క్లోజ్ గా ఉండే ఇద్దరు స్టార్ హీరోయిన్ల పేర్లు బయటకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం. తీగ లాగితే డొంక కదిలినట్టు, ఎంతోమంది ప్రముఖులు ఈ కేసు లో అతి త్వరలోనే చిక్కుకోబోతున్నారని ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్.
గతం లో మాస్ మహారాజ రవితేజ సోదరుడు కూడా ఇలాగే రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. ఆ తర్వాత ఎంతోమంది సెలెబ్రిటీలు డ్రగ్స్ జీవిస్తున్నారని టాక్ రావడంతో రవితేజ, తరుణ్, పూరి జగన్నాథ్ ఇలా ఎంతో మంది సెలెబ్రిటీలను పిలిచి పరీక్షలు చేసారు. ఎలాంటి డ్రగ్స్ సేవించలేదని నిర్ధారణ అయ్యింది. కానీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది మాత్రం రవితేజ సోదరుడు తర్వాత, రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ మాత్రమే. రాబొయ్యే రోజుల్లో ఈ కేసు కి సంబంధించి ఇంకెన్ని వివరాలు బయటకి రాబోతున్నాయో చూడాలి.