మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘ Waltair Veerayya ‘ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామిని సృష్టించిన సంగతి తెలిసిందే..ఈ సినిమాను దర్శకుడు బాబీ తెరకెక్కించగా, ఈ సినిమాను మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా చిత్ర యూనిట్ రూపొందించింది. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ ఊరమాస్ అవతారం మెగా ఫ్యాన్స్‌కు మంచి కిక్కిచ్చింది. అయితే ఈ సినిమాలోని బాస్ పార్టీ సాంగ్ ప్రేక్షకులందరికీ విపరీతంగా నచ్చిన సంగతి తెలిసిందే.. అందుకే సినిమాకు ఇంకా క్రేజ్ తగ్గలేదు.. ఇప్పటికే అదే జోష్.. ఈ సినిమా లో బాస్ పార్టీ సాంగ్ ఎంత హైలెట్ అయ్యింది.. ఆ సాంగ్ కు ఊర్వశి తీసుకున్న రెమ్యూనరేషన్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది..
వింటేజ్ చిరు ఈజ్ బ్యాక్ అనేలా ఆయన డ్యాన్స్ స్టెప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక దేవిశ్రీ అందించిన మ్యూజిక్ ఈ సాంగ్‌ను ఆడియెన్స్‌కు మరింత చేరువ చేసింది. కాగా, ఈ సాంగ్‌లో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా చిరుతో కలిసి స్టెప్పులేసింది. బాస్ పార్టీ అంటూ ఆమె చేసిన డ్యాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాయి..ఈ సాంగ్ కోసం ఊర్వశి ఏకంగా రూ.2 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ సాంగ్‌లో ఆమె కేవలం 3 నిమిషాలు కనిపించగా, ఇంత భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఈ సినిమాలో నటించిన ప్రకాశ్ రాజ్ తన పాత్ర కోసం తీసుకున్న రెమ్యునరేషన్ రూ.1.5 కోట్లు కావడం గమనార్హం. దీంతో ఆమెకు ఇంత భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఎందుకు ఇచ్చారా అంటూ మెగా ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.. ప్రస్తుతం చిరంజీవి భోళాశంకర్ సినిమాలో నటిస్తున్నాడు.. ఈ ఏడాది సినిమా విడుదల కానుంది..ఆ సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటో చూడాలి..