బుల్లితెర ప్రేక్షకులు వయస్సు తో సంబంధం లేకుండా టీవీలకు అతుక్కుపోయి చూసే షోస్ లో ఒకటి బిగ్ బాస్. ఈ రియాలిటీ షో కి మన తెలుగు ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ఎన్ని సీజన్స్ వచ్చినా బ్లాక్ బస్టర్ హిట్ చేసేస్తున్నారు. కేవలం బిగ్ బాస్ ఆరవ సీజన్ తప్ప, ఇప్పటి వరకు వచ్చిన అన్నీ సీజన్స్ పెద్ద హిట్ అయ్యాయి. ఇక ఈ ఏడాది ప్రారంభం అవ్వబోయే బిగ్ బాస్ సీజన్ 8 పై ఇప్పటి నుండే భారీ అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ నెలలో కానీ, లేదా ఆగష్టు చివరి వారంలో కానీ ఈ సీజన్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సీజన్ కి నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తారు అనే టాక్ ఉండేది కానీ, అందులో ఎలాంటి నిజం లేదని తెలిసింది. ఈ సీజన్ కి కూడా అక్కినేని నాగార్జుననే హోస్ట్ గా వ్యవహరించనున్నాడు. ఇప్పటికే ఈ సీజన్ కి సంబంధించిన కొన్ని వివరాలు సోషల్ మీడియా లో లీక్ అయ్యాయి.
అయితే ఈ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్స్ చివరి లిస్ట్ దాదాపుగా ఖరారు అయ్యినట్టు తెలుస్తుంది. ఒక్కసారి ఆ లిస్ట్ చూస్తే జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా పాపులారిటీ ని సంపాదించి, ఆ తర్వాత నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ద్వారా వ్యాపారవేత్తగా కూడా గొప్పగా రాణించి, ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన కిరాక్ ఆర్పీ ఈ బిగ్ బాస్ లేటెస్ట్ సీజన్ లో పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే సీరియల్స్ లో విలన్ గా , సోషల్ మీడియా లో హాట్ సెలబ్రిటీ గా పేరు తెచ్చుకున్న రీతూ చౌదరి, యాంకర్ విష్ణు ప్రియా వంటి వారు కూడా ఖరారు అయ్యినట్టు తెలుస్తుంది. గత సీజన్ లో సెన్సేషన్ సృష్టించి రన్నర్ గా నిల్చిన అమర్ డీప్ సతీమణి తేజస్విని కూడా ఈ బిగ్ బాస్ రియాలిటీ షో లో పాల్గొనబోతున్నారట.
ఇక అద్భుతమైన వంటకాలతో హైదరాబాద్ నగరవాసులను మైమరపించిపోయేలా చేసిన కుమారి ఆంటీ కి కూడా ఈ సీజన్ లో పాల్గొనే అవకాశం వచ్చిందట, కానీ ఆమె ఈ అవకాశాన్ని స్వీకరిస్తుందో లేదో చూడాలి. గత ఎన్నికలలో పోటీ చేసిన బర్రెలక్క కూడా ఈ సీజన్ లో కంటెస్టెంట్ గా రావడం దాదాపుగా ఖరారు అయ్యినట్టే. అలాగే సీరియల్ నటీనటులు హారిక, అక్షిత, సాయి కిరణ్ లతో పాటుగా స్టాండప్ కమెడియన్ గా పాపులారిటీ తెచ్చుకున్న శ్యామా హరిణి, ప్రముఖ యూట్యూబర్ వర్ష, సోషల్ మీడియా టాప్ సెలబ్రిటీ కుషిత వంటి వారు కూడా ఖరారు అయ్యినట్టు సమాచారం. అలాగే గత సీజన్ లోనే వస్తుంది అనుకున్న సురేఖ వాణి ఈ సీజన్ లో తన కూతురుతో కలిసి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టబోతుందట. ప్రస్తుతం వివాదాల్లో చిక్కుకున్న రాజ్ తరుణ్ కోసం కూడా బిగ్ బాస్ యాజమాన్యం సంప్రదించారు కానీ, ప్రస్తుతం ఉన్న చిక్కుల్లో ఆయన ఈ షో లో పాల్గొంటాడా లేదా అనేది చూడాలి.