Manchu Vishnu తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాలలో ఒకటిగా మంచు కుటుంబం కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మంచు మోహన్ బాబు విలన్ గా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, హీరో గా ఇలా ఎన్నో రకాల పాత్రలు పోషిస్తూ ఇండస్ట్రీ లో లెజండరీ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఆయన కుటుంబం నుండి ఇండస్ట్రీ కి వచ్చిన ఇద్దరు కుమారులు కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయారు. మంచు మనోజ్, మంచు విష్ణు కి చెప్పుకోదగ్గ హిట్లు ఉన్నప్పటికీ కూడా, తమకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకోవడంలో ఇద్దరూ విఫలం అయ్యారు. మంచు మనోజ్ సినిమాలను యధావిధిగా కొనసాగించి ఉంటే ఆయన మంచి స్థానం కి వెళ్ళేవాడేమో కానీ, మధ్యలో ఆయన వ్యక్తిగత కారణాల వల్ల సినిమాలకు కొంతకాలం దూరం అవ్వడం తో ఆయనకీ ఉన్న క్రేజ్ మొత్తం పోయింది.
ఇప్పుడు మళ్ళీ ఆయన కెరీర్ ని తిరిగి ప్రారంభించాడు, ఈ సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఇదంతా పక్కన పెడితే మంచు విష్ణు సోషల్ మీడియా లో బాగా ట్రెండ్ అయ్యే సెలెబ్రిటీలలో ఒకరు అనే సంగతి మన అందరికీ తెలిసిందే. ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్ మరియు ట్విట్టర్ వంటి మాధ్యమాలలో ఆయన ఎప్పటి నుండో ఉన్నాడు. అయితే ఇంస్టాగ్రామ్ లో ఆయన సరికొత్త బెంచ్ మార్క్ ని అధిగమించాడు. ఇప్పటి వరకు ఆయనకీ ఇంస్టాగ్రామ్ లో 8 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ఈ ఫాలోవర్ల సంఖ్య టాలీవుడ్ లో బడా సూపర్ స్టార్స్ గా కొనసాగుతున్న ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ. ఎన్టీఆర్ కి 7.5 మిలియన్ ఫాలోవర్లు ఉండగా, పవన్ కళ్యాణ్ కి 3.4 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.
అయితే పవన్ కళ్యాణ్ ఇంస్టాగ్రామ్ లోకి ఆరు నెలల క్రితమే వచ్చాడు.అందుకే ఆయన ఫాలోవర్స్ సంఖ్య తక్కువ గా ఉంది. అయితే ఇంస్టాగ్రామ్ లో అధిక శాతం మంది సెలెబ్రిటీలు ఫాలోవర్లను డబ్బులిచ్చి కొనుక్కుంటారని, మంచు విష్ణు కి కూడా అలాంటి ఫాలోవర్లు మాత్రమే ఉన్నారని సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్లు చెప్తున్న మాట. ఇకపోతే మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలో హీరోగా చేస్తున్నాడు. ఈ చిత్రం లో రెబెల్ స్టార్ ప్రభాస్ తో పాటుగా అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ వంటి బడా సూపర్ స్టార్స్ కూడా నటిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం పై మంచు విష్ణు చాలా ఆశలు పెట్టుకున్నాడు. మరి ఈ సినిమా అయిన కెరీర్ ని మలుపు తిప్పుతుందో లేదో చూడాలి.