Spirit : పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నాడు.. రీసెంట్ గా కల్కి సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. ఆ సినిమా ప్రస్తుతం భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.. కలెక్షన్ల పరంగా సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే రూ. 900 కోట్లు దాటేసి రూ. వెయ్యి కోట్ల దిశగా శర వేగంగా దూసుకుపోతోంది. బుక్ మై షోలో కోటి టికెట్స్ బుక్ కావడం, ఓవర్సీస్లో అత్యధికంగా వసూళ్లు రాబట్టిన తొలి సౌత్ ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించడం ఇలా చెప్పుకుంటూ పోతే రికార్డులను కొల్లగొడుతుంది..
కల్కి సినిమాతో ప్రభాస్ హాలివుడ్ రేంజ్ ను దాటేసింది.. ఆ రేంజ్ లో మార్కెట్ లో విలువలను పెంచుకుంటూ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు.. ఇందులో భాగంగానే దర్శకుడు సందీప్ వంగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అర్జున్ రెడ్డి, యానిమల్ మూవీస్తో తన సత్తా చాటిన డైరెక్టర్ ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమాను చేస్తున్నారు.. ఆ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసే పనిలో ఉంది.. ఈ సినిమా షూటింగ్ మొదలు కాలేదు కానీ అంచనాలు ఓ రేంజులో ఉన్నాయి..
ఈ సినిమాను పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే స్పిరిట్ మూవీలో హాలీవుడ్ విలన్ను తీసుకోవాలని నిర్ణయించారని తెలుస్తోంది. సౌత్ కొరియాకు చెందిన లీ డాండ్ సిక్ని విలన్గా తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.. అతని ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.. ఇకపోతే ఈ చిత్రాన్ని సందీప్ ఏకంగా రూ. 300 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారని వస్తున్నాయి. ఈ చిత్రాన్ని టి.సిరీస్, భద్రకాళి ప్రొడక్షన్స్ కలిసి నిర్మించనున్నారు. ప్రభాస్ ఇందులో పవన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారని తెలిసిందే.. ఈ సినిమాను ఈ ఏడాదిలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్..