Actor Siddharth టాలీవుడ్ లో యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోలలో ఒకరు సిద్దార్థ్. ఈయనకి ఒకప్పుడు ఉన్న ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వంటి సూపర్ స్టార్స్ కి ఏ మాత్రం తీసిపోయేది కాదని ట్రేడ్ పండితులు సైతం చెప్పేవారు. అయితే మధ్యలో కొన్ని ఫ్లాప్ సినిమాలు రావడంతో ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీ ని వదిలి తమిళం లో స్థిరపడ్డాడు. అక్కడ సిద్దార్థ్ కి భారీ హిట్స్ కూడా తగ్గాయి. కానీ తెలుగు లో ఎంజాయ్ చేసిన స్టార్ స్టేటస్ ని మాత్రం దక్కించుకోలేదు. బాగా గ్యాప్ రావడంతో సిద్దార్థ్ కి తెలుగు లో మార్కెట్ పూర్తిగా పొయ్యింది. అయితే రీసెంట్ గానే ఆయన చిన్నా అనే చిత్రం తో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఇప్పుడు కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘భారతీయుడు 2 ‘ చిత్రం లో ఒక ముఖ్య పాత్ర పోషించాడు.
ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమాలో ఆయనది మరో హీరో పాత్ర అనొచ్చు. ఇటీవలే విడుదలైన ట్రైలర్ కి కూడా ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. జులై 12 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల అవుతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నిన్ననే ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. నేడు ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశం లో శంకర్, కమల్ హాసన్, రకుల్ ప్రీత్ సింగ్ తో పాటుగా సిద్దార్థ్ కూడా పాల్గొన్నాడు.
ఎలాంటి ప్రశ్న అడిగినా ముక్కుసూటిగా సమాధానం చెప్పే అలవాటు ఉన్న సిద్దార్థ్ ని ఒక విలేఖరి ప్రశ్న అడుగుతూ ‘తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కొత్త సినిమాల విడుదల కోసం టికెట్ రేట్ పెంపు కొరకు అనుమతి కోసం వస్తే, కచ్చితంగా వాళ్ళు డ్రగ్స్ పట్ల సామజిక సందేశం ఇస్తూ వీడియో చెయ్యాలి అన్నారు. దీనికి మీరు ఏమని సమాధానం ఇస్తారు’ అని సిద్దార్థ్ ని అడగగా, ఆయన దానికి బదులిస్తూ ‘నేను నా కెరీర్ ప్రారంభం నుండే సేఫ్ సెక్స్ మీద జనాల్లో అవగాహనా కల్పిస్తూ కండోమ్ యాడ్స్ చేసేవాడిని. ఒక సెలబ్రిటీ హోదా లో ఉన్న మేము ఇలాంటి సామాజిక స్పృహ ఉండేవాటిపై అవగాహనా కల్పించడం మా బాధ్యత. ప్రత్యేకించి ఎవ్వరూ చెప్పనవసరం లేదు. మాకు సమయం దొరికినప్పుడల్లా మేము వీటిపై అవగాహనా కల్పించే కార్యక్రమాలు చేస్తాము. సీఎం గారు రిక్వెస్ట్ చేస్తే ఆయన కోసం మేము ప్రతేకంగా చేస్తాం, అంతే కానీ మీరు ఇది చేస్తేనే నేను టికెట్ రేట్స్ ఇస్తా అని ఏ సీఎం కూడా చెప్పడు’ అంటూ ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చాడు.
\