Rashmika టాలీవుడ్ టాప్ 3 హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో రష్మిక కచ్చితంగా ఉంటుంది. ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయం లోనే పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక రీసెంట్ గా ఈమె బాలీవుడ్ లోకి ‘ఎనిమల్’ చిత్రం ద్వారా అడుగుపెట్టి, ఆ సినిమాతో ఓవర్ నైట్ బాలీవుడ్ స్టార్ గా ఎదిగిపోయింది. ఇప్పుడు ఆమెకి ఒకపక్క టాలీవుడ్ నుండి ఏ స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయో, అదే స్థాయిలో బాలీవుడ్ లో కూడా ఆఫర్లు వస్తున్నాయి. ఎప్పుడూ సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూ ఉండే రష్మిక, నేడు కూడా ట్రెండింగ్ లోకి వచ్చింది. కారణం ఆమె మెగా ఫ్యామిలీ లోకి అడుగుపెట్టబోతుండడమే. అదేంటి, ఈమె ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ తో ప్రేమలో ఉంది కదా, ఇప్పుడు మెగా ఫ్యామిలీ లోకి ఎంట్రీ అంటున్నారేంటి అని మీరు అనుకోవచ్చు.
కానీ ఆమె అడుగుపెడుతుంది సినిమాల పరంగా. ఇప్పటికే ఆమె స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటిస్తున్న పుష్ప 2 లో హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమా కోసం యావత్తు భారత దేశ సినీ ప్రియులు ఎంత ఆత్రుతతో ఎదురు చూస్తున్నారో మన అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు రష్మిక మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర లో కూడా ఒక ముఖ్య పాత్ర పోషించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల అవ్వబోతుంది. అలాగే అతి త్వరలో సెట్స్ మీదకి వెళ్లనున్న రామ్ చరణ్ – బుచ్చి బాబు సినిమాలో కూడా రష్మిక ఒక పవర్ ఫుల్ పాత్ర పోషించబోతుందట.
ఇప్పటికే ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా జాన్వీ కపూర్ ఫిక్స్ అయ్యింది. వీటితో పాటుగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం లో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పాత్ర కోసం రష్మిక ని అడుగుతున్నారట. ఇలా చేతినిండా మెగా హీరోల సినిమాలతో, మెగా క్యాంప్ కి పరిమితమైపోయింది రష్మిక. ఒప్పుకున్న ఈ చిత్రాలన్నీ పూర్తి అయ్యాక ఆమె విజయ్ దేవరకొండ ని పెళ్లాడబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. తెలుగు సినిమాలకు దూరమై చాలా కాలమైనా రష్మిక ని మన తెలుగు ఆడియన్స్ ఎలా ఆదరిస్తారో చూడాలి.