Geethu Royal : గీతూ రాయల్.. ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు.. చిత్తూరు యాసలో మాట్లాడుతూ అందరిని ఆకట్టుకుంటుంది.. జబర్దస్త్ లో లేడీ కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి బాగా పాపులర్ అయ్యింది..బిగ్ బాస్ 6 లోకి కూడా వెళ్ళింది.. తన మాటలతో జనాలను అల్లరించింది.. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఎలిమినేట్ అయ్యేవరకు ప్రతి టాస్క్ లో యాక్టివ్గా ఉండేది కానీ ఊహించని రీతిలో ఎలిమినేట్ అయ్యి షాకిచ్చింది.బయటకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ఒప్పుకోలేదు.. కానీ ఆమధ్య యాంకర్ శివతో ఇచ్చిన ఇంటర్వ్యూ మాత్రం గీతూ గురించి ఆసక్తి కర విషయాలను తెలిసేలా చేసింది..
ఆ సందర్బంగా గీతూ రాయల్ మాట్లాడుతూ..తప్పును నిర్భయంగా తప్పని చెప్పే సత్తా నాకుంది. నన్ను అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. కానీ జనాలకు నేను నచ్చలేదేమో, నేను మాట్లాడింది రూడ్‌గా అనిపించినట్లుంది. అయినా అందరితో నేను చాలా ప్రేమగానే ఉన్నాను. ఎవరినీ తక్కువ చేసి మాట్లాడలేదు. బాలాదిత్యతో సిగరెట్ల విషయంలో నేను తప్పు చేయలేదు. ఆ చిన్న గొడవ వల్ల బయటకు వచ్చానంటే నేను ఒప్పుకోను. అయినా టాప్ టెన్‌లో కూడా లేనంటే నేను ఓడిపోయినట్లే అని ఎమోషనల్ అయ్యింది..
ఆదిరెడ్డి నా బెస్ట్ ఫ్రెండ్. నన్ను ఎంతో బాగా అర్థం చేసుకున్నాడు. మనుషుల గురించి, లైఫ్ గురించి, సమయం గురించి అన్నీ బిగ్‌బాస్‌కు వచ్చాకే తెలిసింది. ఎవరెళ్లిపోతారని ఊరికే గెస్ చేసేదాన్ని. అందరి గురించి రివ్యూలు చెప్పే నేను నా గురించి నేను సరిగా రివ్యూ ఇవ్వలేకపోయాను’ అని ఎమోషనలైంది గీతూ.
అనంతరం యాంకర్ శివ మాట్లాడుతూ.. షో తర్వాత కూడా ఎవరితో రిలేషన్ కంటిన్యూ చేయాలనుకుంటున్నావు? ఎవరితో చేయకూడదనుకుంటున్నావు? అని అడిగాడు. దీనికి గీతూ బదులిస్తూ.. ఆదిరెడ్డి, శ్రీసత్య, బాలాదిత్య, శ్రీహాన్, ఫైమా, రేవంత్‌లను జీవితాంతం వదలనంది.. మిగిలిన ఇంటి సభ్యుల ఫోటోలను విరగొట్టింది.. ఇందుకు సంబందించిన వీడియో వైరల్ అవుతుంది.. ప్రస్తుతం గీతూకు సినిమా అవకాశాలు వస్తున్నాయని తెలుస్తుంది..