Sharwanand : శర్వానంద్ పెళ్లాడబోయే అమ్మాయి బ్యాక్‌గ్రౌండ్ గురించి తెలుసా..?

- Advertisement -

Sharwanand : టాలీవుడ్‌లోని బ్యాచిలర్స్ అంతా ఒక్కొక్కరిగా పెళ్లిపీటలెక్కుతున్నారు. రానా, నాగశౌర్య ఇలా టాలీవుడ్‌లోని యంగ్ హీరోలంతా వివాహ బంధంలో అడుగుపెడుతున్నారు. తాజాగా టాలీవుడ్‌లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో ఒకడైన హీరో శర్వానంద్ కూడా పెళ్లిపీటలెక్కబోతున్నట్లు కొంతకాలంగా వార్తలొస్తున్నాయి. ఓ ఎన్‌ఆర్‌ఐను శర్వానంద్ పెళ్లాడబోతున్నాడని అన్నారు. ఆ తరవాత రెడ్డి సామాజికవర్గానికి చెందిన అమ్మాయిని శర్వా పెళ్లిచేసుకోబోతున్నాడని వార్తలు వచ్చాయి.

యూఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఆ అమ్మాయి పనిచేస్తోందని తెలిసింది. ఇప్పుడు అసలు శర్వా పెళ్లాడబోతున్న అమ్మాయెవరు..? ఆమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటో పూర్తిగా తెలిసిపోయింది. మరి శర్వా బ్యాచిలర్‌ లైఫ్‌కు మంగళం పాడబోయే మగువ ఎవరో మనమూ తెలుసుకుందామా..?

Sharwanand
Sharwanand

శర్వానంద్ పెద్దలు కుదిర్చిన పెళ్లికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఇటీవల కథనాలొచ్చాయి. త్వరలోనే ఆ శుభవార్తను అధికారికంగా చెప్పేందుకు సిద్ధమవుతున్నాడని తాజాగా తెలిసింది. శర్వా హైకోర్టు లాయర్ మధుసూధన్ రెడ్డి కుమార్తె  రక్షిత రెడ్డిని పెళ్లాడనున్నాడట.

- Advertisement -

రక్షితకు పొలిటకల్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. రాజకీయ నాయకుడు బొజ్జల గోపాల కృష్ణారెడ్డికి స్వయానా మనవరాలు.  ఆమె మేనమామ గంగారెడ్డి బొజ్జల గోపాల కృష్ణారెడ్డికి అల్లుడు. శర్వానంద్- రక్షిత రెడ్డి జోడీకి ఇరువైపులా కుటుంబ సభ్యులు త్వరలో పెళ్లి తేదీని ప్రకటించనున్నారు.

శర్వానంద్ నిశ్చితార్థం ఈనెల 26న హైదరాబాద్‌లోనే జరగనున్నట్టు సమాచారం. కానీ, ఇప్పటి వరకు అయితే శర్వానంద్ నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. డైరెక్టగా నిశ్చితార్థం చేసుకుని పెళ్లి తేదీని ప్రకటిస్తారో.. లేదంటే రేపు నిశ్చితార్థం, పెళ్లి తేదీల గురించి మీడియాకు వెల్లడిస్తారో చూడాలి. మొత్తానికి అయితే, ‘అన్‌స్టాపబుల్’ షోలో బాలయ్య అడిగిన ప్రశ్నకు చాలా త్వరగానే శర్వానంద్ సమాధానం ఇచ్చేస్తున్నారు. ప్రభాస్ చేసుకునేంత వరకు అయితే ఆగలేదు.

శర్వానంద్ కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న వేళ అభిమానుల్లో ఇది ఆసక్తికరంగా మారింది. ఇటీవలే వర్షం దర్శకుడు శోభన్ కుమారుడు సంతోష్ శోభన్ నటించిన `కళ్యాణం కమనీయం` చిత్రంలో పూర్తిగా పెళ్లిని వ్యతిరేకించేవాడిగా అతిథి పాత్రతో అలరించే ప్రోమో ఆకట్టుకుంది. ఇంతలోనే ఇప్పుడు శర్వా పెళ్లి ప్రకటన ఆసక్తిని కలిగించింది.

ఇక శర్వానంద్ సినిమాల విషయానికి వస్తే.. చివరిగా ‘ఒకే ఒక జీవితం’ సినిమాలో కనిపించాడు. గతేడాది శర్వానంద్ హీరోగా ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’, ‘ఒకే ఒక జీవితం’ సినిమాలు వచ్చాయి. కానీ, ఈ రెండు సినిమాలూ బాక్సాఫీసు వద్ద అంతగా సత్తా చూపలేకపోయాయి. ‘మహానుభావుడు’ తరవాత మళ్లీ శర్వాకు ఆ రేంజ్ హిట్ రాలేదనే చెప్పాలి. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ‘పడిపడి లేచే మనసు’, ‘రణరంగం’, ‘జాను’, ‘శ్రీకారం’, ‘మహాసముద్రం’ సినిమాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి. ఇవి బాక్సాఫీస్ వద్ద కూడా సత్తా చాటలేకపోయాయి.

‘ఒకే ఒక జీవితం’ సినిమా తరవాత మరో ప్రాజెక్ట్‌ను ఇప్పటి వరకు శర్వానంద్ ప్రకటించలేదు. కానీ, ఆయన డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్యతో కలిసి ఒక సినిమా చేస్తున్నట్టు సమాచారం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తోందట. కృతి శెట్టి హీరోయిన్ అని టాక్. అలాగే, ‘ఛల్ మోహన్‌రంగ’ ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వంలోనూ శర్వా ఒక సినిమా చేయబోతున్నట్టు సమాచారం.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here