Unstoppable 2 with NBK : కొలతలు తీసుకుంటానన్న బాలయ్య.. పగలబడి నవ్విన పవర్​స్టార్

- Advertisement -

Unstoppable 2 with NBK .. నందమూరి బాలకృష్ణకు సినిమాలతో ఎంత పాపులారిటీ వచ్చిందో.. అంతకుమించిన పాపులారిటీ ఈ షోతో వచ్చింది. ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి లక్షల్లో అభిమానులున్నారు. కేవలం బాలయ్య అభిమానులే కాదు.. అందరు హీరోల అభిమానులు ఈ షోపై ఇష్టం పెంచుకున్నారు.

Unstoppable 2 with NBK
Unstoppable 2 with NBK

అన్​స్టాపబుల్​ షోతో ఆహా రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ ఓటీటీలో వస్తున్న సినిమాలు, వెబ్ సిరీస్​లు, ప్రోగ్రామ్స్ అన్ని ఒకెత్తైతే అన్​స్టాపబుల్ షో మరో ఎత్తు. ఇప్పటికే సీజన్-1 పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమానికి.. హోస్ట్ బాలయ్యకు వస్తున్న రెస్పాన్స్ చూసి ఆహా టీమ్​ రెండో సీజన్ ప్లాన్ చేసింది. ఇక రెండో సీజన్ గెస్టుల లిస్టు చూసి ఫ్యాన్స్​ నేలమీద నిలబడలేకపోతున్నారు.

నారా చంద్రబాబు నాయుడితో సెకండ్ సీజన్ గ్రాండ్​గా స్టార్ట్ చేశారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, సీనియర్ హీరోయిన్ రాధిక, జయప్రద వంటి వాళ్లు ఈషోకు గెస్టులుగా వచ్చారు. వాళ్లే కాకుండా యంగ్ హీరోలు సిద్ధు, విశ్వక్ సేన్, అడివి శేష్, శర్వానంద్​లు కూడా ఈ షోలో పాల్గొన్నారు. అప్పటికే వస్తున్న గెస్టులతో ఫ్యాన్స్ ఉబ్బితబ్బిబైపోతున్న తరుణంలో.. ఆహా తెలుగు ప్రేక్షకులకు భారీ సర్​ప్రైజ్ ఇచ్చింది.

- Advertisement -

పాన్ ఇండియా స్టార్.. ప్రభాస్​తో ఓ ఎపిసోడ్ ప్రకటించింది. ఇక ఈ ఎపిసోడ్​కు సంబంధించి గ్లింప్స్ నుంచి, ప్రోమో.. పూర్తి ఎపిసోడ్ వచ్చే వరకు ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ ఉత్సాహం చూసి ఆహా టీమ్ ఈ ఎపిసోడ్స్​ను రెండు భాగాలుగా షూట్ చేసింది. ఫస్ట్ భాగం రిలీజ్ చేసిన క్షణాల్లోనే ఫ్యాన్స్ ఉత్సాహంతో ఏకంగా ఆహా సర్వర్ డ్యామేజ్ అయింది. ఇక ఈ షోలో ప్రభాస్​తో బాలయ్య చేసిన హంగామా అంతా ఇంతా కాదు.

ఎలాగైనా ప్రభాస్ చేత తన మనసులో ఉన్న అమ్మాయి గురించి చెప్పించాలని తాపత్రయంతో ప్రభాస్​ను ఇరకాటంలో పడేసేందుకు ప్రయత్నించాడు. ఈ ఎపిసోడ్​లో ప్రభాస్​తో పాటు తన క్లోజ్​ఫ్రెండ్ గోపీచంద్ కూడా పాల్గొన్నాడు. ఈ ఇద్దరు కలిసి బాలయ్యను ఓ పట్టుపట్టారు. బాలయ్య కూడా ఈ ఇద్దరితో బానే ఆడుకున్నాడు. ఈ ఎపిసోడ్ ఇప్పటికీ ట్రెండింగ్​లో ఉంది.

ఇక ప్రభాస్ షోకు వస్తున్నాడని తెలియగానే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్​ లొల్లి షురూ చేశారు. తమ అభిమాన హీరోను షోకు తీసుకురావాలని ఆహాపై ఓ యుద్ధమే చేశారు. ఎట్టకేలకు ఫ్యాన్స్ డిమాండ్ మేరకు ఆహా తలొగ్గక తప్పలేదు. వెంటనే అన్​స్టాపబుల్​కు పవన్​ కల్యాణ్ వస్తున్నాడంటూ ఓ పోస్టు పెట్టింది. ఇక అప్పటి నుంచి ఎప్పుడెప్పుడు పవర్ స్టార్ ఎపిసోడ్ ఉంటుందా అని ఫ్యాన్స్ తెగ ఉత్సాహంగా చూస్తున్నారు.

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పవర్​స్టార్ పవన్​ కల్యాణ్​ అన్​స్టాపబుల్ ఎపిసోడ్​ గురించి ఓ లేటెస్ట్ అప్డేట్​ రిలీజ్​ చేసింది ఆహా టీమ్​. ఎన్​బీకే అన్​స్టాపబుల్ సీజన్​ 2​ ఎపిసోడ్​కి సంబంధించిన ఆ గ్లింప్స్​ను విడుదల చేశారు. ‘నేను నీ కొలతలు తీసుకుంటా’ అంటూ బాలయ్య అనగానే.. పవణ్ కల్యాణ్ పగలబడి నవ్వారు. గ్లింప్స్​ రిలీజయ్యేకంటే ముందు నుంచే సంబరాలు చేసుకున్నారు ఫ్యాన్స్. ట్విట్టర్​లో హ్యాష్​ట్యాగులతో ట్రెండింగ్ సైతం​ చేశారు. గ్లింప్స్​లో పవన్ అవుట్​ఫిట్​ కేక అని నెటిజన్లు కామెంట్​ చేస్తున్నారు. మరోవైపు ఎపిసోడ్​లో ఎటువంటి ప్రశ్నలు ఉండనున్నాయో అని ​ఆసక్తి కనబరుస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here