Director Rajamouli : ఒక సినిమా హిట్ అయినా..ప్లాప్ అయినా కూడా డ్తెరెక్టర్స్ ఖాతాలోనే అది పడుతుంది..ఎంత కష్టపడి సినిమాలు తీసినా కూడా ఏదొక సందర్భంలో సినిమా విమర్శలు అందుకోవాల్సి వస్తుంది.వారి కెరియర్ పైనే కాకుండా ఆర్థిక వ్యవస్థపై కూడా దెబ్బ పడుతుంది. ముఖ్యంగా ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం దర్శకులకు అంత సులువు కాదనే విషయం తెలిసిందే. కానీ రాజమౌళి (Rajamouli)మాత్రం ఎలా మ్యాజిక్ చేస్తారో తెలియదు కానీ ఆయన డైరెక్షన్ లో తెరకేక్కిన ప్రతి సినిమా కూడా రికార్డు క్రియేట్ చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు సినిమాలు వచ్చినా సరే రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ వస్తుంటాయి. దీన్ని బట్టి చూస్తే రాజమౌళి పై ప్రేక్షకులకు ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు..
ఆయన సినిమాలు వస్తున్నాయి అంటే మాత్రం జనాల్లొ ఎదో తెలియని ఆనందం మొదలవుతుంది..ఆయన సినిమాలు అందరికి నచ్చేలా సినిమాలను తీస్తారు..రెమ్యునరేషన్ ఇప్పుడు భారీ రేంజ్ లో తీసుకుంటున్నారని సమాచారం. ముఖ్యంగా సినిమాలకు పారితోషకం తీసుకోవడమే కాకుండా లాభాలలో వాటాలు కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రాజమౌళి పారితోషకం ఎక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ ఆ పారితోషకంలో ఎక్కువ మొత్తాన్ని సినిమాలకు ఉపయోగపడే వస్తువుల కోసమే ఖర్చు చేస్తారట. కొత్త టెక్నాలజీ గురించి తెలుసుకోవడానికి జక్కన్న ఆసక్తి చూపిస్తారని తెలుస్తుంది..
కాగా,సినిమాల ద్వారా రాజమౌళి సంపాదించిన ఆస్తుల విలువ రూ.200 కోట్లకు పై మాటే.. అయితే తాను సంపాదించిన డబ్బులో ఎక్కువ మొత్తాన్ని భూములపై ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తారు. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు సినిమాకు 100 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషకం తీసుకుంటున్నారని సమాచారం. తనకైతే ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రాజమౌళి రేంజ్ పెరగడమే కాదు ఆయన ప్రాపర్టీ విలువ కూడా భారీగా పెరిగిందని ఇండస్ట్రీలో టాక్..ఇకపోతే రాజమౌళి తీస్తున్న మహేష్ బాబు సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. యాక్షన్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇండియన్ సినీ చరిత్రలో నెంబర్ వన్ గా నిలిచి పోతుందని విజయేంద్ర వర్మ ఆశాభావం వ్యక్తం చేశారు..