తెలుగు స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్గా నటిస్తున్న లేటెస్ట్ సినిమా శాకుంతలం ట్రైలర్ తాజాగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.. సమంత ఎప్పటిలాగే తన ఫెర్ఫామెన్స్ ఆకట్టుకుంది.. విజువల్స్ తో ట్రైలర్ సినీ అభిమానులను ఆకట్టుకుంది. అందరిదీ ఒక ఎత్తు, అల్లు అర్జున్ కూతురు Allu Arha ది మాత్రం స్పెషల్.. ఊహించని విధంగా ట్రైలర్ లో అల్లు అర్హ సింహం పై కూర్చొని కనిపించి ట్రైలర్ లో హైలైట్ గా నిలిచింది.
శాకుంతలంలో అర్హ నటిస్తుందని , భరతుడి పాత్రలో కనిపించనుందని ఎప్పుడో ప్రకటించారు చిత్ర యూనిట్.. అర్హ షూటింగ్ వీడియో కూడా వదిలి ప్రమోషన్ చేసుకున్నారు. కానీ అర్హ కి ట్రైలర్ లో పెట్టిన షాట్ , అచ్చం అయ్యప్ప స్వామిలాగా సింహం పై రాజసంగా కూర్చున్న విజువల్స్ మాత్రం బన్నీ ఫ్యాన్స్ కు అదిరిపోయే సర్ ప్రైజ్ అనే చెప్పాలి.. ఖచ్చితంగా ఈ సినిమా తో అర్హ స్టార్ హోదాను అందుకునేలా ఉందని వీడియోను చూసిన బన్నీ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు..
చిన్నప్పటి భరతుడి పాత్రకు ఎవరైతే బాగుంటుంది అనుకుంటుంటే గుణ శేఖర్ గారే అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి ఒప్పించుకున్నారని ఆ క్రెడిట్ ఆయనదే అని దిల్ రాజు వేదికపై చెప్పారు. ఏదేమైనా ‘రుద్రమదేవి’ లో అల్లు అర్జున్ ని ఇప్పుడు ‘శాకుంతలం’లో అర్హని గుణశేఖర్ వాడుకున్న తీరు ఆకట్టుకుంటుంది..మొత్తానికి డైరెక్టర్ కు అల్లు ఫ్యామిలీ బాగా కలిసి వస్తుందని టాక్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది..అర్హ నటిస్తున్న మొదటి సినిమా విడుదల అవ్వకముందే త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ కాంబినేషన్ లో వస్తున్న మూవీలో నటించే ఛాన్స్ కొట్టేసింది..త్వరలోనే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది..