Anchor Sreemukhi : శ్రీముఖి నిజంగా ఆ ఆలోచనలో ఉందా?..మరి అది లేనట్టేనా?

- Advertisement -

Anchor Sreemukhi : యాంకర్ శ్రీముఖి అందరికి తెలుసు..ప్రస్తుతం బుల్లితెరపై కొనసాగుతున్న యాంకర్ల లో ఈమె కూడా ఒకరు..ఈ అమ్మడు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. అంతే రేంజ్ లో రూమర్స్ కూడా వస్తున్నాయన్న సంగతి తెలిసిందే..ఎవరితోనైనా కాస్త క్లోజ్గా మెలిగితే చాలు, వారి మధ్య లింక్ పెట్టేస్తారు. అక్కడ ఎలాంటి పప్పులు ఉడకకపోయినా, ఇక్కడ మాత్రం కథనాలు అల్లేస్తారు. ఏమైనా మాట్లాడితే.. అడ్డ గోలు సామెతలు చెబుతారు..అంతేకాదు లాజిక్‌లతో కౌంటర్లు ఇచ్చేస్తారు. ఇక్కడవరకూ బాగానే ఉంది కానీ.. కొందరు గాసిప్‌రాయుళ్లైతే హద్దుమీరి పుకార్లు సృష్టిస్తుంటారు. ఎలాంటి నిప్పు లేకపోయినప్పటికీ, పొగ పుట్టించేస్తారు..ఒక వార్తను సృష్టిస్తున్నారు..

Anchor Sreemukhi
Anchor Sreemukhi

ఇప్పుడు యాంకర్ శ్రీముఖి పై కూడా అదే జరిగింది. ఈ అమ్మడు పెళ్లికి సిద్ధమవుతోందంటూ పెద్ద ప్రచారానికి తెరలెపేశారు. హైదరాబాద్‌కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తతో ఈ అమ్మడు ఏడడుగులు వేయబోతోందని ప్రచారం జరిగింది..ఇప్పుడు తనకు తెలియకుండానే పెళ్లి ఫిక్స్ చేయడంతో, ఈసారి మరింత ఘాటుగా స్పందించింది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. గాసిప్‌రాయుళ్లకి ఆ వ్యాపారవేత్త ఎవరో తెలీదు కాబట్టి, తండ్రితో శ్రీముఖి కలిసి ఉన్న ఫోటోలను థంబ్‌నైల్స్‌పై పెట్టి, తండ్రి ముఖాన్ని బ్లర్ చేశారు. ఇదే శ్రీముఖికి చిర్రెత్తుకొచ్చేలా చేసింది.

Sreemukhi Photos
Sreemukhi Photos

ఈ వార్తలపై ఇటీవల శ్రీముఖి స్పందిస్తూ..నాకు పెళ్లి ఫిక్స్ అయ్యిందని వస్తున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదు. ఇక్కడ దారుణమైన విషయం ఏమిటంటే.. నా తండ్రి ఫోటోని బ్లర్ చేసి, అతడినే పెళ్లి చేసుకోబోతోందని థంబ్‌నైల్స్ పెడుతున్నారు. ఇది చాలా ఘోరం. ఈ రూమర్లు వినీవినీ నేను అలసిపోయా. ఇంకా నాకు ఎన్నిసార్లు పెళ్లి చేస్తారో ఏమో అంటూ అసహనం వ్యక్తం చేసింది. తనకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, ఆ సమయం వస్తే తానే స్వయంగా వెల్లడిస్తానని స్పష్టం చేసింది.ఈలోపు ఇలాంటి చెత్త న్యూస్‌లు రాయొద్దంటూ వార్నింగ్ ఇచ్చింది…పెళ్ళి వయస్సు దాటి పోయిన కూడా పెళ్ళి ఎందుకు చేసుకొవు అంటూ కామెంట్లు అందుతున్నాయి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here