Shraddha Das : శ్రద్ధా దాస్ అనగానే గుర్తొచ్చేది ఆర్య-2 సినిమాలో శాంతి క్యారెక్టర్. ఆ మూవీలో ఉన్నది కాసేపే అయినా తన కెరీర్ లో గుర్తుండిపోయే పాత్ర అది. సిద్ధూ ఫ్రం శ్రీకాకులం మూవీతో ఈ బ్యూటీ తెరంగేట్రం చేసింది.
ఈ బ్యూటీకి ఎంత అందం.. టాలెంట్ ఉన్నా లక్ మాత్రం బాగాలేదనే చెప్పాలి. ఎందుకంటే ఎంత మంచి మూవీస్ చేసినా.. ఈ భామకు పెద్దగా అవకాశాలు మాత్రం లేవు. సినిమాలు ఎక్కువగా చేయకపోయినా ఈ బ్యూటీ మాత్రం ఎప్పుడూ లైమ్ లైట్ ను వదల్లేదు.
తరచూ సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ కు దగ్గరగా ఉంటోంది. ఇన్నాళ్లూ స్కిన్ షోతో సోషల్ మీడియాలో రచ్చ చేసిన ఈ భామ తాజాగా చాలా డీసెంట్ ఫొటోలు పోస్ట్ చేసింది శ్రద్ధా దాస్.ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
శ్రద్ధా దాస్ తాజాగా పింక్ కలర్ శారీలో ఉన్న ఫొటోలు పోస్ట్ చేసింది. ఈ శారీలో శ్రద్ధా చాలా అందంగా కనిపిస్తోంది. ఎంతైనా అమ్మాయిలు శారీలో భలే అందంగా ఉంటారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ముద్దుగానే కాదు మా శ్రద్ధా చాలా హాట్ గా ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
తాజాగా ఈ బ్యూటీ నెట్ఫ్లిక్స్ ‘పోలీస్’ బిహార్ ఛాప్టర్ అనే వెబ్ సిరీస్ చేసింది. అందులో ముఖ్యపాత్రలో నటించింది. గతంలో కొన్ని వెబ్ సిరీస్లో నటించినా.. ఈ సారి మాత్రం అంతకు మించి ఈ వెబ్ సిరీస్లో మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలో శ్రద్ధా దాస్ అలరించింది. తెలుగు, తమిళ్, హిందీలో కలిపి దాదాపు 40 చిత్రాల్లో నటించింది. ఆర్య2, డార్లింగ్, నాగవల్లి, పీఎస్వీ గరుడవేగ వంటి సినిమాల్లో మెరిసినా.. సరైన అవకాశాలు లేవు.