Ram Charan : టాలివుడ్ యంగ్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన పనిలేదు..ఇటీవలే రాజమౌళి తెరకెక్కించిన భారీ బడ్జెట్ సినిమా ట్రిపుల్ ఆర్ ద్వారా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.. ఇప్పుడేమో సరికొత్త లుక్ తో మరో సినిమా చేస్తున్నారు.. అయితే చెర్రి గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది..రామ్ చరణ్ బాడిపై ఓ తెల్ల సుందరి మనసు పారేసుకుంది.. ఆయన ఫిటినెస్కు ఫిధా అయ్యింది..ఆ విషయాలేంటో ఇప్పుడు చుద్దాము..
రామ్ చరణ్‌పై టైటానిక్ ఫేమ్ ఫ్రాన్సెస్ ఫిషర్ తన ట్విట్టర్లో ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం ఆమె ట్వీట్ వైరల్‌గా మారింది.ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో అద్భుతంగా నటించి సంచలనం సృష్టించారు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. ఆ పాత్రలో చరణ్ ఎంతో ఒదిగిపోయి యాక్ట్ చేశారు. క్లైమాక్స్ సీక్వెన్స్‌లో, ఆయన నటన బీస్ట్ మోడ్‌ను తలపించింది. జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన టైటానిక్‌లో హీరోయిన్ కేట్ విన్స్లెట్కు తల్లిగా నటించిన ఫ్రాన్సెస్ ఫిషర్ తాజాగా చరణ్‌ను పొగడ్తలతో ముంచెత్తారు..
కాగా, చరణ్ ట్వీట్‌కు ఆమె రిప్లై ఇచ్చారు. స్టంట్స్, డ్యాన్స్‌తో పాటు యాక్టింగ్ చేయడంలో ఆయన బాడీ ఫిట్నెస్ చక్కగా ఉందని అభినందించారు. ప్రస్తుతం ఆమె రిప్లై ట్విట్టర్లో తెగ చక్కర్లు కొడుతోంది..తాజాగా శంకర్ రూపొందిస్తున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా చిత్రంలో చరణ్ నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మాత దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కియరా చరణ్ కు జోడిగా నటిస్తుంది..ఈ సినిమా ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది..ఈ ఏడాదిలోనే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది..