Dil Raju : భార్య కోరిక తీరుస్తున్న దిల్‌రాజు.. కోట్లు ఖర్చు చేసి మరీ..

- Advertisement -

ఒక రంగంలో ఓ జనరేషన్ సెటిల్ అయితే ఆ తర్వాత వచ్చే జనరేషన్‌ కూడా దాదాపు ఆ రంగంలోనే సెటిల్ అయ్యేందుకు ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా సినీ రంగంలో నెపోటిజం ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రుల బాటలోనే చాలా మంది వారసులు ఎంట్రీ ఇస్తుంటారు. ఈ మధ్య ఇవి కాస్త ఎక్కువయ్యాయని చెప్పొచ్చు. ఇప్పటిదాకా కేవలం కొడుకులు, కూతుళ్లే వారసులుగా వచ్చేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. వారి బంధువులు కూడా వస్తున్నారు. నెపొటిజంకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే.. టాలీవుడ్ ఏస్ ప్రొడ్యూసర్ Dil Raju భార్య సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వనున్నారట. ఇప్పుడు ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.

ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ వారసులతో ఫుల్ అయిపోయింది. ఒకే కాంపౌండ్ నుంచి పది మంది దాకా హీరోలు వచ్చి బయట వాళ్లకు అవకాశాలు లేకుండా చేస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వాలంటే చాలా కష్టమైపోతోంది. రవితేజ, విజయ్ దేవరకొండ లాంటి కొంత మందికే అది సాధ్యం అయ్యింది. ఈ మధ్య సెలబ్రిటీల కొడుకులు, కూతుర్లతో పాటు.. వారిభార్యలు కూడా సినిమాలపై కన్నేస్తున్నారు. ఈ క్రమంలోనే దిల్ రాజు భార్య సినిమాల్లోకి రాబోతున్నట్టు తెలుస్తోంది.

Dil Raju
Dil Raju

దిల్ రాజు తన రెండో భార్య తేజస్విని కోసం కోట్లు ఖర్చు పెట్టడానికి రెడీ అయ్యాడట. ఆమెకు చాలా కాలంగా ఉన్న కోరిక తీర్చడానికి ఆయన ట్రై చేస్తున్నాడట. దీనికి సంబంధించి క్రేజీ రూమర్ సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. దిల్ రాజు కంటే తేజస్విని వయసులో చాలా చిన్నది. ఆమెకు మోడలింగ్ చేయాలని ఎప్పటి నుంచో కోరిక ఉందట. యాక్టింగ్ అంటే కూడా చాలా ఇష్టమట.

- Advertisement -

మోడలింగ్ చేయాలని చాలా ట్రై చేసిందట కూడా తేజస్విని. కానీ ఆమె కుటుంబం దానికి అంగీకరించలేదట. ఇక వాళ్లని ఒప్పించే ఓపిక లేక.. ఎదిరించలేక తన కలను చంపేసుకుందట. ఈ విషయం దిల్‌రాజును పెళ్లి చేసుకున్న తర్వాత అతనికి చెప్పిందట. ఇక మన రాజు ఓకే చెప్పడంతో ఇప్పుడు ప్లానింగ్ స్టార్ట్ చేశారట. తేజస్వినిని మోడలింగ్ రంగంలో దించడానికి అన్ని ప్లాన్స్ రెడీ చేశారని టాక్. దీని కోసం ఆయన ఏకంగా కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అన్నీ కుదిరితే దిల్ రాజు తన భార్యను హీరోయిన్‌గా కానీ.. ఏదైనా సినిమాలో చాలా ముఖ్యమైన పాత్ర చేయడానికి కానీ రెఫర్ చేస్తారట. ఈ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. దిల్‌రాజు నువ్వు నిజంగా దిల్‌ ఉన్న మొగుడివ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. భర్తంటే ఇలా ఉండాలని అంటూ తెగ పొగిడేస్తున్నారు. మరి కొందరేమో చేతిలో పైసా ఉంటే చందమామను కూడా జేబులో దాచుకోవచ్చంటూ ట్రోల్ చేస్తున్నారు.

టాలీవుడ్‌లో నంబర్ వన్ ప్రొడ్యూసర్‌గా రోజురోజుకీ ఎదిగిపోతున్న దిల్ రాజు ఓ సినిమా కథను ఎంపిక చేయడంలో దిట్ట అని టాక్. సినిమా సక్సెస్‌పై రాజు అంచనా లెక్కతప్పదని అంటారు. ఇప్పుడు దిల్‌రాజు ప్యాన్ ఇండియాను కూడా టార్గెట్ చేశారు. దిల్ రాజు ప్రేమించిన భార్య అనారోగ్యంతో మరణించడంతో.. ఆయన కూతురు దిల్ రాజుకు 50 ఏళ్ల వయస్సులో తేజస్వినితో మళ్లీ పెళ్లి చేసింది. వీరికి రీసెంట్‌గా కొడుకు పుట్టాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here