Senior Actress raasi : సినిమా ఇండస్ట్రీలో వున్న స్టార్ హీరో, హీరోయిన్ల ఆస్తుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. వరుస సినిమాలతో సంపాదించడమే కాదు..బిజినెస్ లు కూడా చేస్తూ వస్తున్నారు.. వేరే వాటితో పోలిస్తే సినీ ఇండస్ట్రీలో మాత్రం సంపాదన కాస్త ఎక్కువగానే వుంటుంది..ఇక విషయానికొస్తే.. బాలనటిగా సినిమాల్లో కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రాశి అందరికి సుపరిచితమే..ఎన్నో సినిమాల్లో నటించింది.ప్రస్తుతం పలు టీవీ సీరియళ్లలో నటిస్తూ విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.
రాశి నటించిన సీరియళ్లకు రికార్డ్ స్థాయిలో రేటింగ్స్ వస్తుండటంతో పాటు ఆమె రెమ్యునరేషన్ కూడా భారీ స్థాయిలోనే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సినిమాల ద్వారా సీనియర్ నటి రాశిబాగానే ఆస్తులు కూడబెట్టారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.. కాగా, ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..రాశి మాట్లాడుతూ తన ఆస్తులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.రాశి మాట్లాడుతూ వెనక్కు తిరిగి చూస్తే నా చిన్నతనం గుర్తుకు వస్తాయని అన్నారు.. ఆ సమయంలో బిజీబిజీగా షూటింగ్స్ లో పాల్గొన్నానని రాశి వెల్లడించారు.నేను డబ్బులు ఏమీ పోగొట్టుకోలేదని ఆమె అన్నారు.
ఇకపోతే సినిమాలలో ఛాన్స్ ల కోసమే బరువు తగ్గానని ప్రేక్షకులు నన్ను ఏ విధంగా చూడాలని కోరుకుంటున్నారో అదే విధంగా కనిపించాలని భావిస్తున్నానని రాశి తెలిపారు.రాశి నిక్ నేమ్ మంత్ర కావడం గమనార్హం.ఏపీలోని బెజవాడలో జన్మించిన రాశి చెన్నైలో చదువుకున్నారు. ఆదిత్య369 సినిమాలో రాశి నటించారనే విషయం చాలామందికి తెలియదు..
ప్రస్తుతం ఈమె వయస్సు 42 సంవత్సరాలు..5000 రూపాయల పారితోషికంతో కెరీర్ ను మొదలుపెట్టిన రాశి ఆస్తుల విలువ 20 కోట్ల రూపాయలు ఉంటుంది.. ఇప్పుడు మాత్రం పలు సీరియల్స్ లో నటిస్తున్నారు..