Vijay Deverakonda : నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కాకుండా, రెగ్యులర్ హీరోయిన్ గా సమంత నటించిన చిత్రం ‘ఖుషి’. విజయ్ దేవరకొండ హీరో గా నటించిన ఈ సినిమా రీసెంట్ గానే విడుదలై మంచి పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఈ సినిమా లో విజయ్ దేవరకొండ మరియు సమంత మధ్య కెమిస్ట్రీ ఇండస్ట్రీ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిల్చింది.
ఇంత హాట్ రొమాన్స్ సమంత ఈమధ్య కాలం లో ఏ హీరోతో కూడా చెయ్యలేదు. ఈ సినిమా ప్రొమోషన్స్ సమయం లోనే సమంత మయోసిటిస్ చివరి దశ ట్రీట్మెంట్ కోసం న్యూయార్క్ కి వెళ్ళింది. అక్కడ కొద్దిరోజులు చికిత్స తీసుకొని , మళ్ళీ హైదరాబాద్ కి వచ్చి కొన్ని రోజులు ఇంటర్వ్యూస్ ఇచ్చింది. ఆ రేంజ్ డెడికేషన్ ఈ సినిమా కోసం పెట్టింది ఆమె.
అయితే రీసెంట్ గా వీళ్లిద్దరు కలిసి విమానాశ్రయం లో కనిపించారు. కానీ ఎందుకో ఒకరికొకరు సంబంధం లేకుండా నడుచుకుంటూ ఎవరి కార్లు వారు ఎక్కి వెళ్లిపోయారు. విజయ్ దేవరకొండ సమంత ని చివర్లో రెండు సార్లు పిలిచినా కూడా ఆమె పట్టించుకోకుండా కార్ ఎక్కి వెళ్ళిపోయింది. దీనిని బట్టీ వీళ్లిద్దరి మధ్య ఏదైనా గట్టి గొడవ జరిగిందా అనే అనుమానం అభిమానుల్లో నెలకొంది.
ఇన్ని రోజులు షూటింగ్ లో పని చేసినా రాని గొడవలు, ఇప్పుడు ఏ విషయం లో వచ్చి ఉంటుంది అని అనుకుంటున్నారు. లేకపోతే ఇద్దరు బాగా ఒత్తిడి కి లోను అవ్వడం వల్ల అలా ఎవరి పాటికి వారు వెళ్ళిపోయి ఉండొచ్చు అని కూడా అంటున్నారు. ఇందులో ఏది నిజమో తెలియాలి. ఇది ఇలా ఉండగా సమంత ఈ చిత్రం తర్వాత ఏడాది వరకు సినిమాలకు దూరంగా ఉండబోతుంది. మయోసిటిస్ చివరి ట్రీట్మెంట్ తర్వాత డాక్టర్లు ఏడాది వరకు విశ్రాంతి తీసుకోమన్నారని, అందుకే ఆమె గ్యాప్ ఇవ్వనుందని తెలుస్తుంది.