Pavitra Naresh ఈ పేర్లు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి..వీరిద్దరి మధ్య ఎదో ఉందనే వార్తలు గుప్పుమన్నాయి..ఆ వార్తలనే ఇప్పుడు నిజం చేశారు..ఇన్నాళ్లు రిలేషన్‌షిప్ విషయంలో అఫీషియల్‌గా క్లారిటీ ఇవ్వని ఈ జంట… కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ ఓపెన్ అయ్యారు..
కాగా, తాజాగా తమ బంధాన్ని రివీల్ చేస్తూ ఓ వీడియోను సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశారు. కొత్త సంవత్సరం, కొత్త ప్రారంభాలు.. మీ అందరి ఆశీస్సులు కావాలి అంటూ తన రిలేషన్ గురించి అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ ఇచ్చారు నరేష్, పవిత్ర. అనుమానాలు అవసరం లేదు, గ్యాప్‌కు తావు లేదు. మేము ఇద్దరం కాదు.. ఒక్కటే అంటున్నారు ఈ జంట. అంతేకాదు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం.. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ వీడియో రిలీజ్ చేశారు. న్యూ ఇయర్.. న్యూ బిగినింగ్స్.. నీడ్ ఆల్ యువరి బ్లెస్సింగ్స్ అంటూ ట్వీట్ చేశారు నరేశ్. #PavitraNaresh అనే హ్యాష్‌ట్యాగ్‌ను దీనికి యాడ్ జత చేశారు..
వాస్తవానికి, నరేశ్ చాలా కాలం నుంచి తన మూడో భార్య రమ్యకు దూరంగా ఉంటున్నారు. మనస్పర్థలు కారణంగా పవిత్ర సైతం తన భర్తకు దూరంగా ఉంటూ వస్తున్నారు. పలు ల్లో కలిసి నటించిన.. వీరివురు… కొద్ది రోజులుగా సహజీవనం చేస్తున్నారు. తాజాగా తమ వైవాహిక బంధంపై స్పష్టత ఇచ్చారు. కాగా వీరు తమ రియల్ లైఫ్‌ను ఓ రీల్ స్టోరీగా కూడా తెరకెక్కించబోతున్నారు. సో.. ఇది దానికి సంబంధించిన ప్రొమో కూడా అవ్వొచ్చు.. ప్రస్తుతం ఆ ప్రోమో వీడియో నెట్టింట వైరల్ అవుతుంది..ఆ వీడియోను చూసిన వారంతా ఈవయస్సులో ఇదేంటి బుద్ది అంటూ కామెంట్లు చేస్తున్నారు.. వీరిద్దరి సినిమాల తో బిజిగా ఉన్నారు..మొత్తానికి వీరి బంధానికి ఒక క్లారిటీ ఇచ్చారు..ఆ స్పెషల్ వీడియోను మీరు ఒకసారి చూసి తరించండి..