Pavitra Lokesh : షూటింగ్ బ్రేక్‌లో శోభనం.. నరేశ్ కామెంట్స్‌పై పవిత్రా లోకేశ్ రియాక్షన్ ఏంటంటే..?

- Advertisement -

పవిత్రా లోకేశ్.. నరేశ్.. ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్ వీళ్లే. సినిమాలు చేస్తూ వీళ్లు ఎంత పాపులారిటీ సంపాదించారో పర్సనల్‌ లైఫ్‌లోనూ అంతే పాపులారిటీ పొందారు. కాకపోతే పర్సనల్ లైఫ్ పాపులారిటీ కాస్త నెగిటివ్ టైపు. మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురు భార్యలను వద్దనున్న నరేశ్.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ Pavitra Lokesh తో ప్రేమలో పడ్డాడు ఆ తర్వాత వాళ్లిద్దర కొంతకాలం సహజీవనం కూడా చేశారు.

కొంతకాలం నుంచి సహజీవనం చేస్తున్న వీళ్లు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న నరేశ్ మూడో భార్య రమ్య రఘుపతి తనకు విడాకులు ఇవ్వకుండా నాలుగో వివాహం ఎలా చేసుకుంటావు అంటూ కూడా నరేశ్‌పై తీవ్రంగా ఫైర్ అయింది. వీళ్లిద్దరూ కలిసి తన లైఫ్ నాశనం చేస్తున్నారంటూ కొద్దిరోజుల క్రితం నానా గొడవ చేసింది. ప్రస్తుతం ఈ టాపిక్ కాస్త కూల్ అయింది.

- Advertisement -

మరోవైపు పవిత్ర లోకేశ్‌ భర్త కూడా ఇద్దరు పిల్లలు జన్మించిన తర్వాత తన భార్య ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావడం లేదు అంటూ మీడియా ముందుకు వచ్చి తన ఆవేదన వ్యక్తం చేశాడు. కానీ ఆమె మాత్రం తాము సహజీవనం చేస్తున్నామని , త్వరలోనే పెళ్లి చేసుకుంటామని వాళ్లకి కృష్ణ సపోర్ట్ కూడా ఉందని ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది.

పర్సనల్ లైఫ్ ఎలా ఉన్నా ప్రొఫెషనల్‌గా మాత్రం పవిత్ర-నరేశ్‌ల కెరీర్ సూపర్ ఫాస్ట్‌గా సాగిపోతోంది. చాలా వరకు సినిమాల్లో ఈ ఇద్దరు కలిసే నటిస్తున్నారు. ఇక వీళ్లిద్దరూ కలిసి నటించిన సినిమాలు హిట్ అవ్వడం వీళ్లకి బాగా కలిసొస్తోంది. ఈ క్రమంలో ఈ ఇద్దరు ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ .అందరూ బాగుండాలి అందులో నేనుండాలి’. కమెడియన్ అలీ నిర్మాతగా చేసిన మొదటి చిత్రం ఇది. ఈ మూవీలో అలీ కూడా కీలక పాత్రలో నటించాడు.

 

అయితే ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా అలీ, పవిత్ర లోకేశ్, నరేశ్ కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ మూవీలో అలీ పెళ్లి చూసిన తర్వాత అతడి భార్య జుబేదా ఎలా ఫీల్ అయిందని అలీని నరేశ్ అడగ్గా.. ఆయనకి పెళ్లిళ్లు(సినిమాలో) మామూలేగా అని పవిత్రా లోకేశ్ అన్నారు. అప్పుడు అలీ తన సినీ కెరీర్‌లో ఓ విషయం షేర్ చేసుకున్నారు. ఓ సినిమాలో భాగంగా ఫస్ట్‌నైట్ సీన్ చేయాల్సి వచ్చిందని.. ఆరోజే తన మ్యారేజ్ డే అని.. ఆరోజు సెట్‌కు తన భార్య జుబేదా పిల్లలతో కలిసి వచ్చారని చెప్పారు.

ఆ సీన్ చూసి జుబేదా.. ‘కానీయండి.. మన మంచమే కదా అంటూ చిరుకోపం ప్రకటించిందని’ అలీ చెప్పారు. ‘అదేంటి మీ మంచం’ అని నరేశ్, పవిత్ర ఒకేసారి అడగ్గా ఆ సినిమా డైరెక్టర్ తమ ఇంటికి వచ్చినప్పుడు ఆ మంచం చూసి సినిమాలో వాడేద్దామని అన్నారని అలీ తెలిపారు. అలా ‘మా మంచంపై హీరోయిన్‌తో ఫస్ట్‌నైట్ సీన్ జరిగిందని’ అలీ చెప్పారు. అయితే అలీ తన పెళ్లైన వెంటనే ఓ సినిమా షూటింగ్ నిమిత్తం సెట్‌కు వెళ్లారని.. ఆ షూటింగ్ బ్రేక్‌లో తన ఫస్ట్‌ నైట్ చేసుకున్నారని నరేశ్ చెప్పారు. ఆ మాటతో షాకైన పవిత్ర ఒక్కసారిగా నవ్వేసింది. ఈ ముచ్చట తర్వాత ఈ ముగ్గురు తమ సినిమా ప్రమోషన్స్ గురించి మాట్లాడుకున్నారు.

 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here